Nanayathara Vignesh Shivan Marriage Documentary Teaser: కొన్నాళ్ల క్రితం నయనతార విఘ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సినీ ప్రముఖులు చాలామంది తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, మరికొందరు సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు. అయితే వీరి వివాహం కంటే ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తో ఒక డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఆ డీల్ ప్రకారం నెట్ఫ్లిక్స్ వీరి వివాహ వేడుకలన్నీ దగ్గరుండి నిర్వహించింది. దానికి సంబంధించి వీడియోలు తీసుకుని తమ ఓటీటీలో స్ట్రీమ్ చేయబోతోంది. అలా చేసేందుకు గాను భారీగానే నయనతార దంపతులకు నెట్ ఫిక్స్ సొమ్ములు చెల్లించింది. ఇక ఇప్పటికే నెట్ఫ్లిక్స్ వీరి వివాహ వేడుకలను స్ట్రీమింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. త్వరలోనే వీరి వివాహ వేడుక నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయబోతుంది. ఇక దానికి సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ లో నయనతార విగ్నేష్ శివన్ గురించి విగ్నేష్ శివన్ నయనతార గురించి తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కనిపించారు.
Nanayathara Hospitalised Due to Food Poison:
ఇక తాజాగా నయనతార హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త చేసిన ఒక పని వల్ల ఆమె ఇలా హాస్పిటల్ పాలు అయింది అంటూ ప్రచారం జరుగుతోండడంతో తల్లి కాబోతోంది ఏమో అనుకుంటున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. గత వీకెండ్ లో ఇద్దరూ ఇంట్లోనే ఉండడంతో నయనతారకు సర్ప్రైజ్ ఇవ్వాలని విగ్నేష్ శివన్ స్వయంగా ఒక రెసిపీ తయారు చేసి నయనతార చేత తినిపించాడట.
అయితే ఆ రెసిపీ తేడా పడటంతో నయనతారకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఇక కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తరువాత నయనతారను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని అయితే ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అయితే భర్త చేసిన పనికి వాంతులు చేసుకుందంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆమె తల్లి కాబోతుందేమో అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read: Nanayathara: భర్త చేసిన పనికి నయనతారకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు!
Also Read: Balakrishna: టాలీవుడ్ నిర్మాతలకు బాలకృష్ణ దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు నష్టనివారణ చర్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook