Krithi Shetty Valentine Day: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ పాఠాలు చెబుతున్న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి
Krithi Shetty Valentine Day: `ఉప్పెన` సినిమాతో వెండితెరకు హీరోయిన్ పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఇటీవలే తన మొదటి చిత్రానికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో ఆమె మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి శెట్టి ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ పాఠాలు చెబుతోంది. అవేంటో మీరూ చూసేయండి.
Krithi Shetty Valentine Day: మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి కృతి శెట్టి నటించిన తొలి చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సహా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు దక్కించుకున్నాయి. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో భారీగా ఆఫర్లను చేజిక్కించుకొన్నది హీరోయిన కృతి శెట్టి.
ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల్లోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది హీరోయిన్ కృతి శెట్టి. "జీవితంలో ఎవరినైనా ప్రేమించడం లేదా ఎవరితోనైనా ప్రేమించబడడం చాలా ఆనందకరమైన విషయం" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో కృతి పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో రెడ్ డ్రస్సులో లవ్ సింబల్ బెలూన్ తో పోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసింది.
కృతిశెట్టి కేవలం పక్కింటి అమ్మాయిగానే కాకుండా మోడరన్ గర్ల్‌గా తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నది. ఇటీవల ఆమె ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె లుక్, ఫోటోలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతున్నాయి. అభిమానులు ఆమె అందానికి ముగ్దులు అవుతున్నారు.
కృతి శెట్టి కొత్త చిత్రాలు..
కృతి శెట్టి.. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ నటించనున్న కొత్త చిత్రాల్లోనూ కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Sree Leela 'Dhamaka' Look: రవితేజ మూవీ నుంచి 'శ్రీలీల' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే..!
Also Read: Rakhi Sawant Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకుల కలవరం.. భర్తతో విడిపోయిన మరో నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook