Kriti Sanon Opens upon her Relationship With Prabhas: ఎలా మొదలైందో ఎక్కడ మొదలైందో తెలీదు కానీ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు అటు బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే కరణ్ జోహార్ షో ద్వారా ఇది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించారు. ప్రభాస్ రాఘవ అనే పాత్రలో నటించగా ఆయన సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత కరణ్ జోహార్ షో లో కృతి సనన్ పాల్గొన్నప్పుడు ఏ సమయంలో అయినా నీ ఫోన్ లిఫ్ట్ చేసే ఒక సెలబ్రిటీకి ఫోన్ చేయమని ఆయన కోరడంతో కృతి సనన్ ప్రభాస్ కు ఫోన్ చేస్తుంది. కొన్ని రింగ్స్ కే ప్రభాస్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే పుకారు బలంగా మొదలైంది. ఇక ఇటీవల భేడియా సినిమాతో కృతి సనన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాని మరింత ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా ఒక షోలో పాల్గొంటే ఆ షోలో కూడా కరణ్ జోహార్ పాల్గొని వరుణ్ ధావన్ చేత కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేయించారు.[[{"fid":"254328","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కృతి సనన్ గురించి మాట్లాడుతున్న సమయంలో కృతి సనన్ పేరు ఎందుకు లిస్టులో లేదు అని అడిగితే కృతి సనన్ పేరు కావాలని చెప్పలేదని ఎందుకంటే ఆమె పేరు ఈ లిస్టులో అక్కర్లేదని వరుణ్ ధావన్ కామెంట్ చేస్తాడు. ఎందుకు అంటే ఆమె పేరు మరొకరి గుండెల్లో ఉందని అనడంతో పాటుగా అతను ప్రస్తుతానికి ఇక్కడ లేడని దీపికతో కలిసి షూటింగ్లో ఉన్నాడని కామెంట్ చేశాడు. అప్పుడు దీపికతో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఉన్నది ప్రభాస్ కావడంతో ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉందనే వార్త మరోసారి తెరమీదకు వచ్చింది.


ఇక కొందరైతే ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్లో ఆమెకు ప్రపోజ్ చేశాడని కూడా ప్రచారం చేస్తూ రావడంతో వీటికి పుల్ స్టాప్ పెట్టాలని కృతి సనన్ భావించింది. ఇది ప్రేమ కాదు అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు, మా భేడియా అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడాడు అతని వ్యంగ్యం ఎక్కడికో దారితీసి అనేక రకాల పుకార్లకు ఇప్పుడు తావిస్తోంది. ఏదో ఒక వెబ్సైట్ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించక ముందే నేను ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని  అనుకుంటున్నాను ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. సో ఇకనైనా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.


Also Read: Ap Government: ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు, ఇకపై టీచర్లకు బోధనేతర విధుల్లేవు


Also Read: 'శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook