కరీనాతో డేటింగ్ చేశాడట..!
వివాదాస్పద చిత్ర సమీక్షకుడు మరియు నటుడు కమల్ ఆర్ ఖాన్, కరీనాపై అనుచితమైన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఆమెతో ఏదో ఫంక్షన్‌లో దిగిన ఫోటో పోస్టు చేసి " నాతో నాలుగేళ్లు కరీనా డేటింగ్ చేసింది, అందుకు సాక్ష్యమే ఈ ఫోటో" అని ట్వీట్ చేశాడు. హృతిక్‌తో కంగనకు జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ, ఆమె మాటలు తప్పు అని చెప్పడానికి ఈ ఉదాహరణ అని తను అభిప్రాయపడ్డాడు. అయితే కరీనా అభిమానుల నుండి కేఆర్‌కేకి ఊహించని షాక్ ఎదురైంది. కరీనాకి భంగం కలిగేలా హద్దుమీరి మాట్లాడుతున్నావని, అతనిని తిట్టిపోశారు. కేఆర్‌కేకి వివాదాల్లో నిలవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా బాహుబలి 2 చిత్రాన్ని తెగతిడుతూ విమర్శించి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్‌లో కేఆర్‌కే హీరోగా కూడా నటించాడు. తానే నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమా పేరు "దేశద్రోహి". అయితే ఆ సినిమా తర్వాత తను నటించిన పలు చిత్రాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో సినిమా సమీక్షకుడిగా మారాడు కేఆర్‌కే.