Kukatpally Court Key Orders to Youtube Channels on samantha Defamation Case: హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి హైకోర్టులో ఊరట లభించింది. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు అప్లోడ్ చేసిన రెండు యూట్యూబ్ ఛానెల్స్ (సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మంగళవారం, కూకట్ పల్లి కోర్టులో వాదోపవాదనలు విన్న కోర్డు.. సమంతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోలు మరియు ఇతర రెండు యూట్యూబ్ ఛానళ్లు సమంతకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని ఇంజెక్షన్లకు జారీ చేసింది. ఇకపై సమంత వ్యక్తిగత విషయాల గురించి, కుటుంబ సభ్యుల గురించి ప్రసారం చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. 


Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!


దీంతో పాటు.. సమంత కూడా తన వ్యక్తి గత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ కోర్టు సలహా ఇచ్చింది. 


నాగ చైతన్యతో విడాకుల (Naga Chaitanya) తరువాత సమంత (Samantha) ఏ పని చేసిన గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్య మరియు సమంత విడాకుల (Samantha Nagachaitanya Divorce) ప్రకటన చేసే సమయంలోనే... "మా ఇద్దరీ వ్యక్తిగత విషయాలగురించి గానీ, పర్సనల్ లైఫ్ విషయాల గురించి గానీ మీడియా, అభిమానులు మరియు సోషల మీడియాలో మాకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచారాలు చేయొద్దని కోరారు". 


కానీ కొంత మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా సమంతను టార్గెట్ చేస్తూ చాలా రూమర్స్ వచ్చాయి. వీటిలో సమంతకు.. "తన స్టైలిష్ ప్రీతం (Preetham) కు మధ్య ఎదో ఉందని, ప్రీతమ్ వల్లే ఇద్దరికీ విడాకులు జరిగాయని మరియు సమంత పిల్లలు వద్దు అన్నందుకే నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని"..ఇలా చాలా రకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి.


Also Read: Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్‌ నిలువరించగలదా..??


వీటన్నింటికి చెక్ పెడుతూ సమంత సోషల్ మీడియాలో "ఇలా వ్యక్తిగత దాడి చేయటం సరికాదని, నన్ను వదిలేయండి.. ఇంకోసారి ఇలాంటి పోస్ట్ లు పెడితే కకఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని వార్నింగ్  కూడా ఇచ్చింద సంగతి మన అందరికీ తెలిసిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook