Samantha Char Dham Yatra : ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్ర

Samantha Himalayan vacay trip : సమంత తన ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుసగా విహార యాత్ర చేసింది. బాధలో ఉన్న ఆమె దాని నుంచి బయటపడేందుకే ఇలా తీర్థయాత్రలకు వెళ్లిందట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 01:30 PM IST
  • ముగిసిన సమంత తీర్థయాత్ర
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో ఛార్ ధామ్ యాత్ర
  • నాగ చైతన్యతో విడాకుల అనంతరం వరుసగా విహార యాత్ర
  • బాధ నుంచి బయటపడేందుకే తీర్థయాత్ర
Samantha Char Dham Yatra : ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్ర

Samantha Ruth Prabhu concludes Himalayan vacay with trip to Badrinath Temple: సమంత వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో డెహ్రాడూన్‌ వెళ్లిన సమంత తర్వాత హిమాలయాల సమీపంలోని పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకున్నారు. య‌మునోత్రి (Yamunotri) నుంచి గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్‌, (kedarnath) బ‌ద్రీనాథ్ (badrinath) వ‌ర‌కు సమంత తీర్థయాత్ర సాగింది. సమంత (Samantha) ప్రత్యేక హెలికాప్టర్‌లో ఛార్ ధామ్ యాత్ర కొనసాగించారు.

 

సమంత తన ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో (Helicopter‌) తిరుగు ప్రయాణమయ్యారు. నాగ చైతన్యతో (Naga Chaitanya) విడాకుల అనంతరం సమంత వరుసగా విహార యాత్ర చేసింది. బాధలో ఉన్న ఆమె దాని నుంచి బయటపడేందుకే ఇలా తీర్థయాత్రలకు వెళ్లిందట. 

Also Read : Radheshyam Teaser: ప్రభాస్‌ రాధేశ్యామ్‌ టీజర్‌ వచ్చేసింది

ఇక విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సమంత.. తిరుపతి, శ్రీకాశహస్తిలకు వెళ్లారు. తాజాగా తన చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్స్ తో పాటు స్టోరీస్‌ రూపంలో డైలీ షేర్‌ చేసింది సమంత. చార్‌ ధామ్‌ యాత్రలో (Char Dham Yatra) తన స్నేహితురాలు శిల్పారెడ్డితో (Shilpa Reddy) కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది.

సినిమా విషయాలకొస్తే సమంత శాకుంతలం మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది. తమిళంలో విజయ్‌ సేతుపతితో (Vijay Sethupathi) ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమాలో సమంత నటిస్తోంది. అలాగే డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి సామ్ ఒకే చెప్పింది. అలాగే షారుఖ్‌ ఖాన్‌, (Shahrukh Khan) అట్లీ కాంబోలో వస్తోన్న మూవీలో కూడా సమంత (Samantha) హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్.

Also Read : Happy Birthday Prabhas: అభిమానులకు డార్లింగ్​- సినీ రంగంలో గ్లోబల్​ స్టార్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News