Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.  విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్రం మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా కుర్చీ మడత పెట్టి అనే ఒక సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పాట ప్రోమో విడుదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అయితే ఈ పాట మ్యూజిక్ కన్నా ఎక్కువ ఈ పాటలో వాడిని పదం  ఎక్కువ చర్చలకు దారితీసింది. 


అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరికి తెలీదు. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత, తన మాటతీరుతో తెగ వైరల్ అయిపోయాడు. 'కుర్చీ మడతపెట్టి..' అని తాత చెప్పిన ఓ డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. డైలాగ్‌లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మాస్ పాట చేసేశారు. అంతేకాదు పాటలో కొన్ని లైన్లు ఆ కుర్చీ తాత దగ్గరే పాడించారు.


దీనిపై చాలామంది నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్న…కొంతమంది మాత్రం ఏమీ పట్టించుకోకుండా పాట ఊర మాస్ గా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నిన్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రోమోలో మహేశ్-శ్రీలీల స్టెప్పులు కూడా ఇరగదీసారు. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం ఈరోజు ఫుల్ సాంగ్ విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సాంగ్ తప్పకుండా థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంది అన్నడంలో సందేహం లేకుండా పోయింది. 


ఈ నేపథ్యంలో ఈ సాంగ్ లో వాడిన పదం కోసం కుర్చీ తాతకి డబ్బులు ఎంత ఇచ్చారో అనే సందేహం కూడా అందరిలో నెలకొంది…ఇక ఇదే విషయంపై ఆ తాత స్పందించారు. ఈ పాట మొత్తం తాను పాడలేదని కొన్ని లైన్స్ మాత్రమే తను పాడానని చెప్పుకొచ్చారు.. అంతేకాదు తన పదం పాటలో వాడినందుకు కాను తనకు లక్ష రూపాయలు ఇచ్చారు అని అసలు విషయం బయట పెట్టాడు కుర్చీ తాత. మహేష్ బాబు లాంటి హీరో సినిమాలో తన పదం వాడుకోవడం తన అదృష్టం అని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇకపోతే జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter