Lala Bheemla Full Song: భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా నాయక్' ఫుల్ సాంగ్ ను చిత్రబృందం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రొమో, టీజర్ ఆకట్టుకుంటుండగా.. సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది.



 


Also Read: Marakkar OTT Release Date: రూ.100 కోట్లతో నిర్మించిన నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా.. చివరికి ఓటీటీ రిలీజ్ 


Also Read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి