Laabam movie trailer: విజయ్ సేతుపతి, జగపతి బాబు, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లాభం మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. వ్యవసాయం, అటవీ సంపద సంరక్షణ కోసం పాటు పడే యువకుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా మరోసారి వెండితెరపై జగపతి బాబు విలనిజం చూడొచ్చు. చాలా సినిమాల్లో తరహాలోనే తన స్వప్రయోజనాల కోసం ప్రకృతిని, ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టే వ్యాపారవేత్త పాత్రలో జగ్గూ భాయ్ (Jagapathi Babu) తన విశ్వరూపం చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్


తమిళ దర్శకుడు ఎస్పీ జననాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ కంపోజర్ డి ఇమ్మాన్ మ్యూజిక్ అందించాడు. విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్, 7సీస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై విజయ్ సేతుపతి, పి అరుముగకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సరసన శృతి హాసన్ జంటగా నటించింది. 


లాభం సినిమా పూర్తి కథా, కమామిషు (Laabham movie review) ఏంటో తెలియాలంటే.. సెప్టెంబర్ 9న లాభం మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే.


Also read : Seetimarr Trailer: "సౌత్ కా సత్తా మార్ కే నై.. 'సీటీమార్' కే దికాయేంగే" గోపిచంద్ సినిమా ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook