Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్

Tuck Jagadish Trailer: టక్ జగదీష్ మూవీ అభిమానులకు వినాయక చవితి (Ganesh chaturthi 2021 date) కానుకగా సెప్టెంబర్ 10న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2021, 08:28 PM IST
  • విడుదలకు సిద్ధమైన టక్ జగదీష్ మూవీ.
  • నాని ఫ్యాన్స్‌కి వినాయకచవితి కానుకగా అమేజాన్ ప్రైమ్‌లో టక్ జగదీష్.
  • టక్ జగదీష్ ట్రైలర్ విడుదల చేసిన అమేజాన్ ప్రైమ్
Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్

Tuck Jagadish Trailer: టక్ జగదీష్ మూవీ ట్రైలర్ విడుదలైంది. న్యాచురల్ స్టార్ నాని, నటి రీతు వర్మ (Ritu Varma), జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన టగ్ జగదీష్ ట్రైలర్ మూవీ ట్రైలర్ చూస్తోంటే.. కుటుంబ బాంధవ్యాల కోసం ఏమైనా చేసే యువకుడిగా, ఎవరినైనా ఎదిరించే ధీరుడిగా టక్ జగదీష్ పాత్రలో నాని ఆకట్టుకుంటాడనిపిస్తోందంటున్నారు నాని అభిమానులు. నిన్ను కోరి, మజిలీ వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈసారి కూడా టక్ జగదీష్ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడనిపిస్తోందని శివ నిర్వాణ చిత్రాల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన టక్ జగదీష్ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

 

టక్ జగదీష్ మూవీ అభిమానులకు వినాయక చవితి (Ganesh chaturthi 2021 date) కానుకగా సెప్టెంబర్ 10న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. సాహు గారపాటి, హరిష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. 

Also read : Jabardasth Avinash Engagement photos gallery: ఎంగేజ్మెంట్‌తో సడెన్ షాకిచ్చిన ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరో తెలుసా?

టక్ జగదీష్ సినిమాలో నటి రీతూ వర్మ ఒక వీఆర్వో పాత్రలో కనిపించనుంది. తరతరాలుగా భూతగాదాలతో నలిగిపోతున్న భూదేవిపురంలో భూమి గొడవలు పరిష్కరించేందుకు టక్ జగదీష్ ఏం చేశాడనేదే పాయింట్ చుట్టూ కథ అల్లుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టక్ జగదీష్ ట్రైలర్ (Tuck Jagadish Trailer) సినిమాపై అంచనాలు పెంచిందని అభిమానులు చెబుతున్నారు.

Also read: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్‌ను విచారించిన ఈడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x