Super Queen Season 2 Promo: బుల్లితెరపై జీ తెలుగు చేసే షోలు ఎంతో హిట్ అవుతుంటాయి. ఇక ప్రదీప్ షోలు అంటే జీ తెలుగులో ఎంతో ఆదరణను దక్కించుకుంటాయి. ప్రదీప్ హోస్ట్‌గా చేసిన సూపర్ క్వీన్ షో ఫస్ట్ సీజన్ బాగానే హిట్ అయింది. ఇప్పుడు రెండో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ రెండో సీజన్‌లో బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా తారలు వచ్చారు. ఇందులో ముఖ్యంగా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, కండక్టర్ ఝాన్సీ, సింగర్ మౌనిక యాదవ్‌లు హైలెట్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్‌ గెస్ట్‌గా వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ షోలో విద్యుల్లేఖ రామన్, కండక్టర్ ఝాన్సీలు కన్నీరు పెట్టేసుకున్నారు. సామీ సామీ పాటను పాడి ఫేమస్ అయిన మౌనికా యాదవ్ తన ఫ్యామిలీని స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. తమ కోసం తమ తండ్రి ఎంతలా కష్టపడ్డాడో చెప్పి అందరినీ ఎమోషనల్‌ చేసింది.


ఇక కండక్టర్ ఝాన్సీ విషయంలో అయితే తమ నాన్న పూర్తిగా వదిలేస్తే.. అమ్మ పెంచిందని చెబుతూ ఏడ్చేసింది. ఇది ఓవర్ నైట్ స్టార్డం కాదని, ఎన్నో ఏళ్ల కష్టమని చెప్పుకొచ్చింది. లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఈ షోకు తన భర్తను తీసుకొచ్చినట్టుంది. తన మీద జరిగిన ట్రోలింగ్, బాడీ షేమింగ్ మీద స్పందించి ఎమోషనల్ అయింది.


Also Read:  Akhil Akkineni Birthday : అఖిల్ బర్త్ డే.. ఇంకా కష్టపడుతున్న అక్కినేని హీరో.. అన్నీ అందని ద్రాక్షలానే?



తనకు పెళ్లైన కొత్తలో హనీ మూన్ టైంలో బికినీ వేసుకుంటే.. ట్రోల్స్ చేశారు.. ఏనుగు, పంది ఇలా నోటికి ఏ పేరు వస్తే ఆ జంతువు పేరుతో ట్రోల్ చేశారు.. అంటూ ఎమోషనల్ అయింది. అయితే విద్యుల్లేఖను ఓదార్చేందుకు కాజల్ కూడా మాట్లాడింది. నా ప్రెగ్నెన్సీ టైంలోనూ లావు ఎక్కానంటూ జనాలు ట్రోల్స్ చేశారు అని కాజల్ చెప్పుకొచ్చింది.


ఇక విద్యుల్లేఖ మధ్యలో బాగానే తగ్గింది. వర్కౌట్లు చేసింది. నార్మల్ సైజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ ఇప్పుడు పాత రూపంలోకి మారింది. విద్యుల్లేఖ మ్యారేజ్ పిక్స్, బికినీ ఫోటోలు అప్పట్లో ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే.


Also Read: Allu Arjun Birthday : మెగా నీడలోంచి సొంత బ్రాండ్.. గంగోత్రి టు పుష్ప.. అల్లు అర్జున్‌ కెరీర్‌లో వివాదాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook