Laggam Update: ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.‌ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్మేట్ నమ్ముకొని మనం ముందుకి రాబోతోంది లగ్గం అనే చిత్రం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల 
రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. పర్ఫెక్ట్ వెన్నుభోజనంల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా.. ఈ సినిమాని ఎంతో కనులవిందుగా చూపించబోతున్నాము అని ఇప్పటికే దర్శక, నిర్మాతలు తెలియజేశారు.


ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు.. ఉంచే ఈ సినిమాని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు..  కొన్ని తరాలు గుర్తుంచుకుంటారు అని తెలియజేశారు  నటకిరిటి రాజేంద్రప్రసాద్.


ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. ఈ క్రమంలో లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.
ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ లగ్గం ఆడియో రైట్స్ ను అద్భుతమైన ధరకు సొంతం చేసుకోవడం విశేషం. జూన్ 21న ఈ సినిమా నుంచి.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇక పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్.. అందరిని తప్పకుండా ఆలరించనుందని వేణు గోపాల్ రెడ్డి గారు తెలియజేశారు.


 ఈ సినిమాలో..సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం


Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి