Dheera Trailer Released: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో మాస్ హీరోగా లక్ష్ చదలవాడ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ‘ధీర’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధీర గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు హైలెట్ అవుతున్నాయి. ‘ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు అది వెరీ డేంజరస్’.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘రాజ్‌ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే.. రథం నడిపే కృష్ణుడితో పాటు.. యుద్దం చేసే రాముడు రావాలి.. ఎవడైనా ఉంటాడా?’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడం అదిరిపోయింది. వాడి పేరు రణధీర్.. 6'2 ఉంటాడు.. అని హీరోని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. 


 



‘నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు’ అని హీరో చెప్పే డైలాగ్.. ‘ఐ లవ్యూ మనీషా’.. ‘ఐ లవ్యూ అమృతా’.. అంటూ హీరో రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. ‘ఇప్పటి దాకా లవ్ స్టోరీ చూశావ్.. ఇప్పుడు యాక్షన్ మూవీ చూపిస్తా’.. అంటూ హీరో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు. ‘ వాడు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూకంపం తరువాత భూమిలా ఉంటుంది’.. అంటూ హీరో గురించి అద్భుతంగా ఎలివేట్ చేశారు. ‘నేను యుద్దం చేయడం ఏంట్రా.. యుద్దమే మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ వస్తోంది.. రూ. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు  చేరింది..’ అంటూ చివరి డైలాగ్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.


 



నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు


సాంకేతిక బృందం
సమర్పణ: చదలవాడ బ్రదర్స్ 
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర 
నిర్మాత: పద్మావతి చదలవాడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ:  కన్నా పీసీ
ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
ఎడిటర్: వినయ్ రామస్వామి
రచన మరియు దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు


Also Read: Osmania University: అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన అగంతకులు.. బాత్రూమ్ అద్దాలు పగలగొట్టి..  


Also Read: Oily Skin: ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఈ విధంగా రాయండి.. ముఖం మెరిసిపోతుంది..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook