Osmania University Girls Hostel: సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో కలకలం రేగింది. అర్ధరాత్రి వేళ ముగ్గురు ఆగంతకులు అమ్మాయిల హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి చొరబడి.. విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. గమనించిన అమ్మాయిలు.. వెంటనే అప్రమత్తమై ఒకరిని పట్టుకున్నారు. చున్నీతో కట్టేసి అనంతరం పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. హాస్టల్లోకి దూరిన మరో ఇద్దరు ఆగంతకుడు తప్పించుకుని పారిపోయాడు. హాస్టల్లో తమకు రక్షణ కరవైందని.. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.
విద్యార్థులను ధర్నా విరమించాలని ఓయూ రిజిస్ట్రార్ కోరగా.. వీసీ వచ్చే వరకు ధర్నా విరమించమని స్టూడెంట్స్ స్పష్టం చేశారు. రాత్రి 2 గంటలకు ముగ్గురు ఆగంతకులు తాగి హాస్టల్లోకి వచ్చారని వారు తెలిపారు. హాస్టల్ వాష్‌రూమ్ వెంటిలేటర్స్ నుంచి చేతులు పెట్టి రమ్మని పిలుస్తున్నారని చెప్పారు. స్టూడెంట్స్ అందరం కలిసి ఒక వ్యక్తిని పట్టుకున్నామని.. ఇద్దరు పారిపోయారని అన్నారు. గత వారం రోజులుగా ఇలాగే జరుగుతుందని.. కాలేజ్ చుట్టూ గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందన్నారు. వీసీ వచ్చి తమకు పూర్తి భద్రత కల్పించాలని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 250 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్‌కి కేవలం ఒకరే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Also Read: KTR Republic Day: గవర్నర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యలు
Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook