Lata Mangeshkar was given Slow Poison: నేడు స్వర కోకిల లతా మంగేష్కర్ మొదటి వర్ధంతి, ఆమె ఇదే రోజు అంటే , ఫిబ్రవరి 6, 2022 న మరణించారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ ఎనిమిది దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో 36 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడింది. ఆమె తన గాత్రంతో అనేక  సినిమాలకు ప్రాణం పోశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే యుక్త వయసులో ఉండగా ఆమె మీద ఒక విష ప్రయోగం జరిగింది. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వాస్తవానికి, లతాకి 33 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించారట. 1963లో స్లో పాయిజన్ ఇచ్చిన బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ, నేను మంచం మీద నుండి లేవలేకపోయాను, మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగిందని అన్నారు.


నేను స్వయంగా నడవలేని పరిస్థితి ఏర్పడిందని, అది  జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం కాబట్టి మా కుటుంబం దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడదని అన్నారు. స్లో పాయిజన్‌తో తనను ఎవరు చంపడానికి ప్రయత్నించారో, దాని గురించి తనకు తెలిసిందని, అయితే ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయలేనని, ఆ వ్యక్తి పేరు ఎప్పుడూ తెరపైకి కూడా రాలేదని లతా వెల్లడించారు.


ఇక లతా స్వరం కూడా విషం కారణంగా పోయిందని మీడియా కథనాలు మొదలవగా ఆమె ఈ విషయాన్ని ఖండించారు. విషం కారణంగా తన గొంతు ఎప్పుడూ పోలేదని, ఇవి పుకార్లు మాత్రమే అని అన్నారు. 6 ఫిబ్రవరి 2022న, లతా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆమెకు కరోనా సోకడంతో ఆ తర్వాత ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. కొన్నాళ్ల పాటు చికిత్స అందుకుని ఆమె చివరికి తుదిశ్వాస విడిచారు. 2001లో లతా మంగేష్కర్ కి భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' లభించింది. 


Also Read: Vani Jayaram Death Reason: వాణి జయరాం అసలు ఎలా చనిపోయారు? ఎవరైనా కొట్టి చంపారా?


Also Read: Ricky Kej Grammy: మూడో గ్రామీ అవార్డు అందుకున్న బెంగళూరు కంపోజర్.. ఇండియాకి అంకితం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.