Latest OTT Releases: తప్పక చూడాల్సిన లేటెస్ట్ ఓటిటి షోలు
Latest OTT Releases: దసరా ఫెస్టివల్ మూడ్‌తో పాటే మరో వీకెండ్ కూడా వచ్చేస్తోంది. ఈ వీకెండ్ కోసం ఇప్పటికే అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి మాధ్యమాల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎక్కువ పాపులారిటీ ఉన్న షోలు, సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.
Latest OTT Releases: మాన్షన్ 24 :
అదృశ్యమైన తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ యువతికి ఎదురైన కొన్ని అనూహ్య ఘటనలు, దుష్ట శక్తులతో పోరాటమే మాన్షన్ 24 వెబ్ సిరీస్. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ని ఓంకార్ డైరెక్ట్ చేశాడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ద డెవిల్ ఆన్ ట్రయల్ :
దయ్యం పట్టినట్టుగా చెబుతున్న ఓ టీనేజ్ కుర్రాడు చేసిన మర్డర్ చుట్టూ తిరిగే " ద డెవిల్ ఆన్ ట్రయల్ " వెబ్ సిరీస్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఎలైట్ సీజన్ 7 :
స్పెయిన్‌లో ఓ ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటూ చదువుకుంటున్న ముగ్గురు టీనేజర్స్‌కి, అదే స్కూల్లో చదువుకుంటున్న శ్రీమంతుల పిల్లలకి మధ్య జరిగే సంఘర్షణ ఓ మర్డర్‌కి దారితీస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఎలైట్ సీజన్ 7 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.
బాడీస్ :
నాలుగు వేర్వేరు కాలాలకు చెందిన నలుగురు డిటెక్టివ్స్ ఒకే మర్డర్ గురించి చేసిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే ఈ బాడీస్. ఈ వెబ్ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉంది.
కాలా పానీ :
అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మిస్టరీ జబ్బు అందరినీ వెంటాడుతుంది. ఆ సమస్యను ఎదుర్కునేందుకు పరిష్కారం కోసం అన్వేషించే క్రమంలో జరిగే ఘటనల సమాహారమే కాలా పానీ. కాలా పానీ వెబ్ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.
పర్మనెంట్ రూమ్మేట్స్ సీజన్ - 3 :
మూడేళ్ల పాటు దూరంగా ఉండి ప్రేమించుకున్న ఓ జంట చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన ఘటనలకు దృశ్యరూపమే పర్మనెంట్ రూమ్మేట్స్ సీజన్ - 3. ఇది అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి : పోలీసు స్టేషన్ లో 'జైలర్' నటుడు వీరంగం.. వినాయకన్ అరెస్ట్
ది నన్ -II :
ఫ్రాన్స్‌లో 1956 లో ఒక క్రిస్టియన్ మత పెద్ద ఘోర హత్యకు గురవగా.. ఆ హత్యకు దారి తీసిన కారణాలను వెతుక్కుంటూ వెళ్లిన సిస్టర్ ఇరెనెకు, ఆత్మలకు మధ్య జరిగిన పోరాటమే ది నన్ -2 వెబ్ సిరీస్. ఇంకెందుకు ఆలస్యం మరి.. ఓటీటీలో ఈ లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.
ఇది కూడా చదవండి : Chiranjeevi : ఫైనల్ గా మిగతా హీరోల దారికి వచ్చేస్తున్న చిరంజీవి !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి