Megastar Chiranjeevi : మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక అడుగు వెనక ఉన్నారనే చెప్పాలి. గత కొంతకాలంగా చిరంజీవి కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేదు. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో పర్వాలేదు అనిపించిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నారు. కానీ ఈ మధ్య విడుదల అయిన భోళా శంకర్ సినిమాతో మాత్రం మళ్లీ బోల్తా పడ్డారని చెప్పుకోవాలి.
ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాగా రెండవది తమిళ్ డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్ తో చేస్తున్న సినిమా. నిజానికి పి ఎస్ మిత్రన్ రామ్ చరణ్ కోసం ఒక కథను వినిపించారని కానీ ఇప్పుడు అది చిరంజీవి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మిత్రన్ తో కలిసి చెన్నైలో చిరు కూడా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వశిష్ట సినిమా పూర్తి అవ్వగానే పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని చిరంజీవి పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం.
అయితే భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి తను చేయాల్సిన ఒక రీమేక్ సినిమాని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త డైరెక్టర్లతో సినిమాలు ఓకే చేస్తున్నారని తెలుస్తోంది. అభిమన్యుడు, సర్దార్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించి హిట్ అందుకున్న పీఎస్ మిత్రన్ చిరంజీవి కోసం కూడా ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ తో సంబంధం లేకుండా ఈమధ్య చిన్న డైరెక్టర్లతో కూడా సీనియర్ హీరోలు సినిమాలు ఓకే చేసి హిట్టు అందుకుంటున్నారు. ఉదాహరణకి జైలర్ సినిమాతో రజనీకాంత్, జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్, భగవంత్ కేసరి సినిమా తో నందమూరి బాలకృష్ణ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించారు. తాజాగా ఇప్పుడు చిరంజీవి కూడా మిగతా సీనియర్ హీరోల బాటలోనే వెళుతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ పేరు వల్ల కాకుండా మంచి కథ ఉన్న స్క్రిప్ట్ ని ఎంచుకొని చిరంజీవి ఎక్స్పరిమెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా సీనియర్ హీరోలకి వర్క్ ఔట్ అయినట్లు ఈ స్ట్రాటజీ చిరంజీవి కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరోవైపు చిరంజీవి ఇప్పటికైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మిత్రన్ కూడా చిరంజీవి ని తన సినిమాలో ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.