Lavanya Thripathi Clarity on Marriage: వరుణ్ తో పెళ్లంటూ వార్తలు..అసలు విషయం చెప్పేసిన లావణ్య
Lavanya Thripathi Clarity on Marriage With Varun Tej: లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలు తెరమీదకు వచ్చిన క్రమంలో ఆమె దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Lavanya Thripathi Clarity on Marriage With Varun Tej: లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమలో మునిగిపోయారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తాజాగా ఒక ప్రచారం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ప్రచారం రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఒక ప్రైవేట్ పార్టీలో కలిసి కనిపించడంతో మరోసారి ఈ వార్తలు తెరమీదకు వచ్చాయి.
తాజాగా ఈ విషయం మీద లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ్ తో తాను రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ తో కలిసి నేను రెండు సినిమాల్లో నటించానని అంత మాత్రానికే లింకులు పెట్టేస్తారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ పుకారు వినడానికి ఏదోలా ఉంది, ఒకసారి అయితే నేను అతనితో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను అని కూడా వార్తలు రాశారు, అది చూసి నేను నిజంగా షాక్ కు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.
అసలు అలాంటి వార్తలు ఎలా రాస్తారు అని లావణ్య త్రిపాఠి ప్రశ్నించారు ఇక ప్రస్తుతానికి తాను సింగిల్గానే ఉన్నానని ఎవరితో ప్రేమలో లేనని క్లారిటీ ఇచ్చారు. అంతేకాక తాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే విషయాన్ని కూడా నమ్మను అని ఎందుకంటే అంత ఈజీగా ఒక వ్యక్తితో ఎవరూ ప్రేమలో పడలేరని తాను భావిస్తానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. అసలు నాకు కొంత సమయం కేటాయిస్తే ఎదుటి వారు ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకుని అప్పుడు ముందడుగు వేస్తా అంటూ లావణ్య త్రిపాఠి తాజాగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఒక ఇంగ్లీష్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె హిట్స్-ఫ్లాప్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటాను అనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చింది. మొదట్లో తాను ఏదైనా సక్సెస్ సాధిస్తే సెలబ్రేట్ చేసుకునే దాన్ని కాదు కానీ తర్వాత అలా చేయకపోవడం తప్పని తెలుసుకొని విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. సక్సెస్ ని ఇతరులతో పంచుకుంటే ఆ హ్యాపీనెస్ రెట్టింపు అవుతుందనే విషయం తనకు లేటుగా అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read: Bhola Shankar Movie Release Date: భోళా శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?
Also Read: Most awaited Telugu films list: తెలుగు ఆడియన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి