Most awaited Telugu films list: తెలుగు ఆడియన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు ఇదే!

Most awaited Telugu films list: ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 04:27 PM IST
Most awaited Telugu films list: తెలుగు ఆడియన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు ఇదే!

Most awaited Telugu films list: తెలుగులో ఇప్పటికే ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్న సినిమాలన్నీ విడుదలయ్యాయి. ఇక సెట్స్ మీద ఉన్న సినిమాలు ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సర్వేలు నిర్వహించే ఆర్మాక్స్ మీడియా సంస్థ. తెలుగు ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్న ఐదు సినిమాలకు సంబంధించిన ఒక లిస్ట్ ప్రచురించింది ఆర్మాక్స్ మీడియా సంస్థ.

ఆగస్టు 15వ తారీకు వరకు ఉన్న లెక్కల ప్రకారం ఐదు సినిమాల కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారట. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాలు ప్రకటించారు కానీ వాటి నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదని అయినా ఆ సినిమాల మీద ఏర్పడిన క్రేజ్ దెబ్బతో తెలుగు ప్రేక్షకులు సినిమాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారని సదరు సర్వే సంస్థ తెలిపింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

తర్వాత  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా కోసం కూడా బాగా ఎదురుచూస్తున్నారు. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ సినిమా కోసం కూడా ఎదురుచూస్తున్నారు. అలాగే అలాగే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి కూడా బాగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ శివా నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమా గురించి కూడా బాగా ఎదురు చూస్తున్నారని తెలిసింది.

అయితే ఈ వారంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా విడుదల కాబోతోంది. దాదాపు 5 భాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు మేకర్స్. కరణ్ జోహార్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, పూరి జగన్నాథ్ ఈ సినిమా సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

Also Read: Bhola Shankar Movie Release Date: భోళా శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?

Also Read: Karthikeya2 Collections: నార్త్ లో షాకిస్తున్న శనివారం వసూళ్లు... ఎన్ని కోట్లో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News