Lavanya Tripathi reacts about her Marriage rumours with Varun Tej: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిలు లవ్‌‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల వరుణ్ తన పుట్టినరోజు నాడు లావణ్యకి ప్రపోజల్ చేసినట్లు కథనాలు వచ్చాయి.  గత రెండు వారాలుగా టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌ అయింది. వరుణ్‌, లావణ్యలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే తాజాగా లావణ్య పరోక్షంగా ఈ విషయంపై స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లావణ్య త్రిపాఠి తన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే' షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రొమోషన్ కోసం లావణ్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించారు. లైవ్ షోలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే చాలా మంది పెళ్లి విషయమై ఆమెను అడిగారు. మొదట్లో స్పందించని లావణ్య.. అభిమానుల ప్రశ్నల దాడి తతుకోలేక రిప్లై ఇచ్చారు. 'నాకైతే నా పెళ్లి గురించి తెలియదు. మరి వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో. నా పెళ్లి గురించి నాకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు' అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. 


లావణ్య త్రిపాఠి తన అభిప్రాయం చెప్పినా వదలని నెటిజన్లు మీరు ఎవరితోనూ ప్రేమలో లేరా? అని ప్రశ్నించారు. అందుకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో  లావణ్య పెళ్లిపై వచ్చిన రూమర్లు ఓ ఫజిల్‌గానే మిగిలిపోయాయి. మరి ఈ రూమర్లపై సరైన  సమాధానం దొరకాలంటే మరికొంతకాలం ఆగలేమో. ఇక వ‌రుణ్‌ తేజ్, లావ‌ణ్య ఇద్ద‌రూ 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' చిత్రాల్లో న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ల‌వ్‌లో ప‌డ్డార‌ని టాక్.


లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న ఈ సొట్టబుగ్గల సుందరికి వరుస ఆఫర్లు వచ్చాయి. 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం', 'చావు కబురు చల్లగా' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అనతికాలంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాలు అందుకున్నారు. 


ALso Read: Ketika Sharma Pics: ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతిపోగోడుతోన్న కేతిక శర్మ!!


Also Read: DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook