DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న డీజే టిల్లు సినిమా ట్రైలర్‌ను నిర్వాహకులు వదిలారు. ట్రైలర్‌ మొత్తం కామిడీ డైలాగులతో నవ్వులు పూయిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 07:09 PM IST
  • డీజే టిల్లు సందడి షురూ
  • డీజే టిల్లు ట్రైలర్‌ చూశారా
  • అసొంటి పాటే కావాలంటూ
DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

 DJ Tillu Movie Theatrical Trailer is Out: గుంటూర్ టాకీస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సిద్ధు జొన్నలగడ్డ.. తాజాగా 'డీజే టిల్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'అట్లుంటది మనతోని' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన డీజే టిల్లు సినిమాకి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు.

డీజే టిల్లు సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇదివరకే చిత్ర బృందం పరకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను నిర్వాహకులు వదిలారు. 'నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో లాంచ్ అవుతున్న నేను' అనే డైలాగ్‌తో డీజే టిల్లు ట్రైలర్‌ మొదలై.. 'ఒకడిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనియన్‌కు తెలియకుండా డ్రాయర్ లాగేయాల' అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. ట్రైలర్‌ మొత్తం కామిడీ డైలాగులతో నవ్వులు పూయిస్తోంది. 

'మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు', 'నేను నిన్ను బోల్ హాటెడ్‌గా లవ్ జేసిన రాధిక', 'తెలిసే అవులగాన్ని జేస్తున్నావ్ నువ్ నన్ను.. సో స్వీట్ అఫ్ యూ'. 'ఆ పెడుతారు నోట్ల పెద్ద ముద్ద', 'ఒకడిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనియన్‌కు తెలియకుండా డ్రాయర్ లాగేయాల' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సిద్ధు, నేహా శెట్టి మధ్య సాగే రొమాంటిక్‌ సీన్స్‌ యువతను పిచ్చేక్కించేలా ఉన్నాయి.

డీజే టిల్లు ట్రైలర్‌లో సిద్ధు జొన్నలగడ్డ లుక్‌, మ్యానరిజం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్ధు పలికే డైలాగ్స్ అద్భుతం. మరోవైపు నేహా శెట్టి అందాల ప్రదర్శన చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదల అయిన ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలంలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి.. ఏ ప్రాంచైజీ అయినా ఆసక్తి చూపేనా?

Also Read: Airtel Lowest Recharge: ఎయిర్ టెల్ స్పెషల్ ఆఫర్.. ఇప్పుడు రూ.58లకే కనీస రీఛార్జ్ ప్లాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News