Kalki 2898 AD Controversy: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. నటించి ఈమధ్యనే బ్లాక్ బస్టర్ అయింది కల్కి 2898 AD. ఈ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను.. క్రాస్ చేసి ఇప్పటికి కూడా అంతే స్ట్రాంగ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్‌ కు పెద్ద షాకింగ్ న్యూస్ వినిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక మత ప్రబోధకుడు ఈ సినిమా నిర్మాతలపై లీగల్ నోటీసు పంపించి అందరికీ షాక్ ఇచ్చారు. శ్రీ కల్కి ధామ్ కర్త ఆచార్య ప్ర‌మోద్ కృష్ణం గురించి అందరికీ తెలుసు. తాజాగా ఆయన కల్కి 2898 AD సినిమా నిర్మాతలు, నటుల మీద, కథ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మతస్తుల మనోభావాలను దెబ్బతీయటంతో పాటు దేవ దూతలను, దేవుడి ప్రతినిధులను చాలా తప్పుగా చూపించారు అని ఆయన వాదన. ఈ నేపద్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ చేసారు.


సినిమా లో చూపించిన కథకి, గ్రంధాల్లో రాసినదానికి సంబంధం లేదు అని అంటున్నారు. హిందూ స్క్రిప్చర్స్ లో వ్రాసినదానికి విరుద్ధంగా కల్కి భగవంతుడిని సినిమా కథలో చూపించారు అని కేసు నమోదు చేశారు. ఈ కథ సరిగ్గా లేదు అని, దాని వల్ల కోట్లు మంది హిందువులు, కల్కి అనుచరుల మనోభావాలను అవహేళనకు గురి అయినట్టు.. ఉంది ఆయన అన్నారు.


అందుకే చట్టపరమైన నోటీసు పంపినట్టు స్పష్టం చేశారు ఆచార్య ప్ర‌మోద్ కృష్ణం. ఈ విషయాలను 15 రోజులలోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా జరగని పక్షంలో సినిమాపై సివిల్, క్రిమినల్ చార్జీలు వేస్తామని, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయినా తాము.. సిద్ధమని హెచ్చరించారు. మరి ఈ విషయం గురించి కల్కి 2898 AD సినిమా నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Readఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook