Prafulla Kar passes away: చిత్రసీమలో విషాదం.. లెజెండరీ సింగర్ ప్రఫుల్లా కార్ కన్నుమూత
Prafulla Kar Death : ఒడిశా చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రఫుల్లా కార్(Prafulla kar) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
Legendary Odia singer Prafulla Kar passes away at 83: లెజెండరీ ఒడియా సింగర్, సంగీత దర్శకుడు ప్రఫుల్ల కార్(83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతి నొప్పి రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కార్కు (Prafulla Kar) భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం పూరీలోని స్వర్గ ద్వార శ్మశాన వాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు ప్రముఖులు.. కార్ మృతికి సంతాపం ప్రకటించారు. "శ్రీ ప్రఫుల్ల కార్ జీ మరణించడం బాధాకరం. ఒడియా సంస్కృతికి, సంగీతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం'' అంటూ మోదీ (PM Modi) ట్వీట్ చేశారు.
Also Read: Samantha Tattoos: సమంత ఒంటిపై ఆ మూడు టాటూలు ఎక్కడ..టాటూలు ఎందుకు వద్దంటోంది
1939 ఫిబ్రవరి 16న పూరీలో జన్మించారు కార్. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, గీత రచయితగా, కాలమనిస్ట్గా చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ (padma shri) అవార్డు అందించింది. 2004లో జయదేవ అవార్డు కూడా వరించింది. ఒడియా భగబత్, ఒడియా ఛండా అనే సంప్రదాయ ఒడియా పాటల అరుదైన సేకరణను రికార్డ్ చేసిన సంగీత విద్వాంసుడిగా కార్ గుర్తింపు పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన 'ప్రభుకృప' అనే భక్తి సంగీత ఆల్బమ్ 10 లక్షల క్యాసెట్లను రికార్డ్ చేసింది. ఉషా మంగేష్కర్, కిషోర్ కుమార్, ఎస్ జానకి, చిత్ర, యేసుదాస్ మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ గాయకులు ఆయన దర్శకత్వంలో పాటలు పాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook