Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే
Lata Mangeshkar Telugu Songs: ఇండియా నైటింగేల్ లతా మంగేష్కర్ అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆమె స్మృతులను తలచుకుంటూ.. అమె పాడిన తెలుగు పాటలను గుర్తు చేసుకుందాం.
Lata Mangeshkar Telugu Songs: లెంజెండరీ సింగర్ లతా మంగేష్కర్.. దాదాపు 80 ఏళ్ల పాటు భారత సినీ పరిశ్రమకు ఆమె ఎనలేని సేవ చేశారు. గత నెల కొవిడ్ సోకడం వల్ల ఆస్పత్రిలో చేరిన లతా మంగేష్కర్.. చికిత్స పొందుతూ.. ఇవాళ (ఫిబ్రవరి 6 ఆదివారం) తుది శ్వాస విడించారు.
కోట్లాది మంది సంగీత ప్రియులు.. లతా మంగేష్కర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
మెలోడీ క్వీన్‌గా, ఇండియన్ నైటింగేల్‌గా పేరు సంపాదించిన లతా మంగేష్కర్.. భౌతికంగా ఈ లోకానికి విడిచి వెళ్లినప్పటికీ.. అమె పాటల రూపంలో ఎప్పటికీ శాస్వతంగా మిగిలిపోతారు.
లతా మంగేష్కర్ తన జీవితకాలంలో ఎక్కువగా బాలీవుడ్ పరిశ్రమకు సేవ చేశారు. 1000కిపైగా బాలీవుడ్ సినిమాలకు ఆమె పాటలు పాడారు. ప్రాంతీయ పాటల విషయానికొస్తే.. 36 భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారామె.
తెలుగులో లతా మంగేష్కర్ పాటలు ఇవే..
లెజెండరీ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లతా మంగేష్కర్ తెలుగులో రెండు పాటలు మాత్రమే పాడినా.. ఆ రెండు సూపర్ హిట్ సాంగ్స్ కావడం విశేషం.
లతా మంగేష్కర్ మొదటి తెలుగు పాటు 65 ఏళ్ల క్రితం పాడారు. 1955లో వచ్చిన సంతానం అనే సినిమాలో 'నిద్దుర పోరా తమ్ముడా' అనే సాంగ్‌ను పాడించారు సంగీత దర్శకుడు సూసర్ల దక్షిణామూర్తి. ఇది చిన్న పిల్లలపై పాడిన లాలి పాట. ఈ పాటను ఇప్పటికీ ఎంతో మంది నిత్యం వింటుంటారు.
30 ఏళ్ల తర్వాత రెండో పాట..
తొలి పాట పాట పాడిన 30 ఏళ్ల తర్వాత మళ్లీ లతా మంగేష్కర్ తెలుగు పాటను ఆలపించారు. 1988లో వచ్చిన 'ఆఖరి పోరాటం' అనే సినిమాలో.. 'తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో' అనే సాంగ్‌ను పాడారు. ఈ సినిమాకు ఇళయరాజ సంగీతమందించారు. పాత పాటలకు సంబంధించి ఏదైన ఈవెంట్ ఉంటే అందులో ఈ పాట కచ్చితంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఈ రెండు సినిమాలకు మధ్య ఉన్న మరో పోలిక ఉన్న ఏమిటంటే.. 'సంతానం' అక్కినేని నాగేశ్వర్ రావు (ఏఎన్ఆర్) హీరో, సావిత్రి హీరోయిన్. 'ఆఖరి పోరాటం' సినిమాలో అక్కినేని నాగార్జున హీరో, శ్రీదేవి హీరోయిన్.
Also read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళి
Also read: Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook