Lokesh Kanagaraj visit Tirumala: కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo).  లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ మూవీపై  భారీగా అంచనాలను పెంచేశాయి. మరో వారం రోజుల్లో మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో .. ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj), డైలాగ్ రైట‌ర్ ర‌త్న కుమార్, లియో మూవీ యూనిట్ గురువారం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే వీరంతా కాలినడకన మధ్యాహ్నం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు లియో మూవీ తెలుగు  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌​లో గ్రాండ్​గా నిర్వహించడానికి మేక‌ర్స్ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి దళపతి విజయ్ రావట్లేదని తెలుస్తోంది. ముఖ్య అతిథులుగా లోకేష్ కనగరాజ్, అనిరుధ్‌లతో పాటు చిత్ర‌బృందం పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్ కీలకపాత్రల్లో నటించారు.  లియో మూవీని లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు. ఇప్పటికే సెన్షార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌  లభించింది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఈ సినిమా  తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు వెచ్చించింది. 



Also Read: Saindhav Movie: ఇవాళ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న సైంధవ్ టీం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook