Ananya Panday Latest Pics లైగర్ సినిమా మీద ఉన్న అంచనాలు, సినిమా విడుదలయ్యాక వచ్చిన టాక్ గురించి అందరికీ తెలిసిందే. లైగర్ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా అనుకున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్‌, పూరి జగన్నాథ్ టేకింగ్ అన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని అనుకున్నారు. ఇక అనన్య పాండే అయితే ఈ సినిమాతో సౌత్‌లో పాగా వేద్దామని అనుకుంది. అలా పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోదామని అనన్య పాండే ఆశపడింది. కానీ ఆ ఆశలన్నీ కూడా ఆవిరయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైగర్ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఇక అందులో అనన్య నటనను దేశ వ్యాప్తంగా ట్రోల్ చేశారు. ఆమె లుక్స్, నటనను దారుణంగా ఏకిపారేశారు. దీంతో అనన్య పాండే కెరీర్ ఖతమైందన్నట్టుగా కామెంట్లు చేశారు. ఏ సీన్ ఎందుకు  చేసిందని, ఒక్క ఎమోషన్‌కి తగ్గట్టుగా సరైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టలేదని అనన్యను ట్రోల్ చేసి పడేశారు. అయితే లైగర్ ఎంత బెడిసి కొట్టేసినా అనన్య మాత్రం అవేమీ పట్టించుకోలేదు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతూ ఫోటోలను వదిలింది.


 



అనన్య పాండే తన మీద జరిగే ట్రోలింగ్ మీద కూడా స్పందించింది. తనను అందరూ ట్రోల్ చేస్తారని, స్టార్ కిడ్ అని నెపోటిజం బ్యాచ్ అని అంటారని చెబుతూ వాపోయింది. కొంత మంది అయితే.. మీ డాడీ చంకీ పాండే ఏమీ స్టార్ కాదు.. నువ్వు స్టార్ కిడ్ అంతకంటే కావు అని అంటారంటూ తన బాధనంతా చెప్పుకొచ్చింది. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య, విజయ్‌లు ఎంత పచ్చిగా మాట్లాడారో అందరికీ తెలిసిందే.


ఇప్పుడు అనన్య పాండే అయితే తాను వేసుకున్న డ్రెస్సుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు డ్రెస్ ఉందా? లేదా? అనే అనుమానం కలిగించేలా కనిపించింది. తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుందా? లేదా ఆ డ్రెస్సే అలా ఉందా? అన్నది అర్థం కాకుండా చేసింది. నెటిజన్లలో అనన్య హీటును పెంచేస్తోంది.


Also Read : Pawan Kalyan Nandamuri Balakrishna : వీర సింహారెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్‌.. బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు


Also Read : Laththi Day 1 Collections : విరిగిన విశాల్ 'లాఠీ'.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook