Liger Digital and Satellite Rights Details: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన సదరు సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి జగన్నాథ్,  చార్మి కౌర్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్,  అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషలలో ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాక భారీగా అంచనాలు కూడా ఏర్పడేలా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసింది సినిమా యూనిట్. అయితే ఆ ప్రమోషన్స్ ప్రభావమో లేక సినిమా అవుట్ ఫుట్ ప్రభావమో తెలియదు కానీ ఈ సినిమాకు శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి అని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా డిజిటల్,  శాటిలైట్ రైట్స్ రెండు కలిపి సుమారు 66 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని అంటున్నారు.


అందులో 55 కోట్ల రూపాయలు కేవలం ఓటీటీ రైట్స్ కోసమే చెల్లించినట్లు తెలుస్తోంది. తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో అంటే సుమారు ఐదు భాషలకు గాను ఈ మేర రేటు కట్టినట్లు చెబుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ మేరకు ఓటిటి హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా దక్కించుకుంది అని ప్రచారం జరుగుతోంది.


అయితే విజయ్ దేవరకొండ లైగర్ థియేటర్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతోందని అంటున్నారు. నిజానికి విజయ్ దేవరకొండకు నైజాం ప్రాంతంలో సూపర్ హిట్ అయిన సినిమాకి కూడా 20 కోట్లకు మించి కలెక్షన్లు రాలేదు. కానీ ఈ సినిమా నైజాం హక్కులు కొనుక్కోవాలంటే నిర్మాతలు 30 కోట్ల రూపాయల రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 30 కోట్ల లోపు అమ్మడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది ఈ సినిమాలో రమ్యకృష్ణ,  మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. 


Read Also: Samantha Ruthprabhu: టాప్ హీరోయిన్ స్థానం కోసం సమంత లంచం.. అలా బయట పెట్టేసిందిగా!


Read Also: Ravi Kishan: బన్నీ విలన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..ఎరక్క పోయి ఇరుక్కుపోయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook