Aafat song release from Vijay Deverakonda's Liger Movie: డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా 'లైగర్‌'. కరణ్‌ జోహార్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్‌ చిత్రం ఆగస్ట్‌ 25న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. సినిమా విడిదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. విజ‌య్‌, అన‌న్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను రిలీజ్‌ చేయగా.. వాటికి విశేషమైన రెస్పాన్స్‌ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైగర్‌ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. 'ఆఫత్‌' అంటూ సాగే పాటను నేడు రిలీజ్ చేశారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన ఈ పాట‌ను సింహా, శ్రావ‌ణ భార్గవి ఆలపించారు. త‌నిష్క్ బ‌గ్‌చీ ట్యూన్ క్యాచీగా ఉంది. ఈ పాట ఫుల్‌ వీడియోని హీరో విజయ్‌ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అని విజయ్‌ కాప్షన్ ఇచ్చాడు. ఈ పాటలో విజయ్‌-అనన్యల కెమిస్ట్రీ బాగుంది. విజ‌య్, అనన్య డ్యాన్స్ స్టెప్స్ కూడా యువతను ఆక‌ట్టుకుంటున్నాయి. 



లైగర్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ముంబై మురికివాడకు చెందిన చాయ్‌ వాలాగా కనిపించనున్నాడు. విజయ్‌కు తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించారు. ఇక ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.



Also Read: India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?


Also Read: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook