రివ్యూ: లైన్ మ్యాన్ (Lineman)
నటీ నటులు: త్రిగుణ్, కాజల్ కుందర్, బి. జయశ్రీ, హారిని శ్రీకాంత్ తదితరులు
సంగీత దర్శకుడు: మణికాంత్ కద్రి
సినిమాటోగ్రాఫర్: శాంతి సాగర్
నిర్మాత: గణేష్ పాపన్న, యతీష్ వెంకటేష్
దర్శకత్వం: రఘు శాస్త్రి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్నాయి. అవి రోజు రోజుకి వివిధ కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా రేడియేషన్ వల్ల ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉండే అనేక కోటానుకోట్ల జీవరాసులు కాలక్రమంలో అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనిషి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా... వాటికి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఇటువంటి మంయి సందేశంతో తెరకెక్కందే త్రిగుణ్ తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ‘లైన్ మ్యాన్’. ఈ చిత్రానికి వి.రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. ప్రెస్టీజియస్ పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న నిర్మించారు. ఈ చిత్రానికి  ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దాం పదండి.


కథ ఏమిటంటే...
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తెపల్లి అనే మారుమూల గ్రామంలో కరెంట్ లైన్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు నట్టు(త్రిగుణ్). ఆ గ్రామంలో విద్యుత్తు సరఫరా సక్రమంగా సాగాలన్నా... అంతరాయం కలగాలన్నా... అంతా నట్టు చేతిలోనే ఉంటుంది. అదే గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పురుడు పోస్తూ... అందరికీ ఆరాధ్య దైవంగా ఉంటుంది 99 ఏళ్ల వృద్ధురాలు దేవుడమ్మ(కన్నడ సీనియర్ నటి బి.జయశ్రీ). ఆమె 100వ పుట్టిన రోజును గ్రామంలో ఘనంగా జరపాలని నట్టు భావిస్తాడు. గ్రామస్థుల సమక్షంలో రంగు రంగుల విద్యుత్తుద్దీపాల మధ్య కేక్ కట్ చేయించి దేవుడమ్మ పుట్టిన రోజు వేడుకలను ధూం ధాం చేద్దాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఏర్పాట్లను ఘనంగా చేస్తారు. అయితే ఆ రోజు రాత్రి కరెంటు సరఫరాని నట్టు ఆపేస్తాడు. దాంతో గ్రామంలో చిమ్మచీకట్లు అలుముకుంటాయి. దాంతో దేవుడమ్మతో సహా... గ్రామస్థులు తీవ్ర నిరాశకు గురవుతారు. నట్టు... విద్యుత్తు సరఫరాని హఠాత్తుగా ఆపేయడానికి కారణాలేంటి? అలా ఆపేసిన విద్యుత్తు సరఫరా ఎన్ని రోజులు ఆగిపోయింది? దాని వల్ల ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? తదితర వివరాలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.



సినిమా ఎలా వుందంటే...
నేటి సాంకేతిక ప్రపంచంలో ఏది చేయాలన్నా విద్యుత్తు తప్పనిసరి. ఓ నాలుగైదు గంటలు కరెంటు లేకుంటేనే అల్లాడిపోతాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ కావాలన్నా... పిండి మర ఆడాలన్నా... టీవీ చూడాలన్నా... ఫ్యాన్ వేసుకోవాలన్నా... కరెంట్ కంపల్సరీ. అలాంటి కరెంటు ఏకంగా పది పదిహేను రోజుల పాటు లేకుండా పోతే... ఆ గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరి అయిపోరూ. అయితే వారికి ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఆ బాధలను ఎంతో ఆనందంగా భరించారు ఆ గ్రామస్థులు. ఈ ప్రపంచంలో బతకడానికి ప్రతి ఒక జీవికి అధికారం ఉంది. మనిషి ఇంకా అంతగా చెడిపోలేదు. మనలో మానవత్వం ఇంకా బతికే ఉంది అని చాటి చెప్పే మెసేజ్ తో ఈ సినిమాని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు.


ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్నాయి. అవి రోజు రోజుకి వివిధ కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా రేడియేషన్ వల్ల ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉండే అనేక కోటానుకోట్ల జీవరాసులు కాలక్రమంలో అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనిషి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా... వాటికి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందనే సందేశం ఇచ్చారు. క్లీన్ విలేజ్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లైన్ మ్యాన్ అందరికీ నచ్చుతాడు. గో అండ్ వాచ్ ఇట్.


నటీనటుల పనితీరు...
త్రిగుణ్... ఎప్పటిలాగే తనదైన స్టైల్లో చాలా నాచురల్ గా నటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మారుమూల గ్రామంలో ఉండే విద్యుత్ లైన్ మ్యాన్ ఎలా మాస్ గా ప్రవర్తిస్తాడో... అలాగే ఉంటుంది తన పాత్ర తీరుతెన్నులు. అతని పాత్రకు పెద్దగా ఎలివేషన్స్ ఏమీ వుండవు. సాధారణ ఊళ్లో తిరిగే పక్కింటి అబ్బాయిలాగ అతని పాత్రను తీర్చిద్దారు. అందుకు తగ్గట్టుగానే పాత్రలో లీనమై నటించారు త్రిగుణ్. ఇందులో హీరోయిన్ కి పెద్దగా పాత్రయేమీ లేదు. కేవలం దేవుడమ్మ మనుమరాలిగా, గ్రామాన్ని వదిలిపోయే హైదరాబాద్ లో చదువుకునే అమ్మాయిగా కాజల్‌ కుందెర్‌ పాత్ర ఉంటుంది. 99 ఏళ్ల వృద్ధురాలిగా సీనియర్ నటి బి.జయశ్రీ బాగా నటించారు. ఆమె చుట్టూనే అల్లుకున్న స్క్రీన్ ప్లే కావడంతో అందుకు తగ్గట్టుగానే ఆమె నటించారు. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ తదితరులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు...


ఎక్కడో కేరళలో జరిగిన ఓ ట్రూ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని ప్రకృతిని కాపాడాలనే ఓ హార్ట్ టచింగ్ మూమెంట్ తో ప్రకృతిని ప్రేమించి ఆరాధించాలని ఓ మెసేజ్ ని ఇవ్వడంలో దర్శకుడు వి.రఘుశాస్త్రి విజయం సాధించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. మట్టి మనుషుల మధ్య ఉండే బాంధవ్యాలను చక్కటి ఎమోషన్స్ ని క్యాప్చర్ చేసారు. కాద్రి మణికాంత్ నేపథ్య సంగీతం బాగుంది. రెండు మూడు పాటలే వున్నా... ఆకట్టుకుంటాయి. నిర్మాతలు ఓ మంచి మెసేజ్ ఉన్న కథను ఎంచుకుని తీయడం అభినందనీయం. ప్రకృతిని ఆరాధించే వారంతా ఈ సినిమాని చూడవచ్చు.


రేటింగ్.. 2.75/5


Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌


Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter