Love Today Fame Ivana లవ్ టుడే సినిమాతో ఇవానా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇంత వరకు డబ్బింగ్ సినిమాలతోనే ఇవానా ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఝాన్సీ సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించి మెప్పించిన ఇవానా.. లవ్ టుడేలో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఇవానా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన మొదటి తెలుగు సినిమా అంటూ తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చింది ఇవానా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు ఆశిష్‌ రెండో సినిమాతో ఇవానా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఆశిష్‌ మొదటి సినిమా రౌడీ బాయ్స్‌ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. కనీసం నటుడిగా ఆశిష్‌కు మినిమం మార్కులు కూడా పడలేదు. యాక్షన్, డ్యాన్స్ ఇలా ఎందులోనూ ఆశిష్ జనాలను మెప్పించలేకపోయాడు. అనుపమ పరమేశ్వరన్‌కు లిప్ లాక్స్ పెట్టడంతో ఆశిష్ వైరల్ అయ్యాడు.


 



ఇక ఇప్పుడు ఇవానాతో రొమాన్స్ చేసి ఫేమస్ అయ్యేలా ఉన్నాడు ఆశిష్‌. సెల్ఫిష్ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఇవానా, ఆశిష్‌లు కనిపిస్తున్నారు. ఇక ఇవానా అయితే చిరాగ్గా ఫేస్ పెట్టినట్టు అనిపిస్తోంది. మరి అలా మూడీగా ఉండటానికి కారణం ఏంటన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


దిల్ రాజు అయితే తన ఇంటి నుంచి వచ్చిన వారసుడ్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దిల్ రాజు.. తన ఇంటి వారసుడికి మాత్రం మంచి డెబ్యూని ఇప్పించలేకపోయాడు. మరి ఇప్పుడు ఈ రెండో సినిమాతోనైనా దిల్ రాజు తమ వారసుడు ఆశిష్‌ని నిలబెడతాడా? లేదా? అన్నది చూడాలి. తన పోరిని రిజ్వర్ చేసిన అంటూ ఈ సినిమాలో చైత్ర అనే పాత్రలో ఇవానా నటిస్తుందంటూ మేకర్లు వదిలిన పోస్టర్ అయితే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook