Family Star First Day Collections : ఎప్పుడో 2018 లో టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఆ తర్వాత బోలెడు సినిమాలు చేశాడు కానీ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేకపోయాడు. ఈ మధ్యనే సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా బోర్లా పడింది అని చెప్పుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ పైనే పెట్టుకున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడు అని అభిమానులు ఆశించారు కానీ ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా ఫాన్స్ ని నిరాశ పరిచాయి.


ఆఖరికి విజయ్ దేవరకొండ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ల కంటే ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే మంచి అంచనాల మధ్య ఏప్రిల్ 5 న విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా మొదటి రోజు 5.75 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసుకుంది. 


మొదటి రోజు నుండి ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం చాలా స్లోగా ఓపెన్ అయింది. దేశ వ్యాప్తంగా మొదటి రోజు కేవలం 5.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


మార్నింగ్ షోకే సినిమా కి నెగిటివ్ టాక్ వచ్చేయడంతో మొదటిరోజు మిగతా షోస్ కి థియేటర్ ఆక్యుపెన్సీ కనీసం 50% కూడా లేదు. ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాలు మొదటి రోజు డబల్ డిజిట్ కలెక్షన్లను అందుకున్నాయి. ఖుషి సినిమా 15.25 కోట్లు వసూలు చేయగా లైగర్ మొదటి రోజు 15.95 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుంది. 


ఆఖరికి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా మొదటి రోజు ఏడుకోట్లను వసూలు చేసింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలైన విజయ్ దేవరకొండ సినిమాలలో మొదటి రోజు అతి తక్కువ కలెక్షన్లను అందుకున్న సినిమాగా మిగిలింది.


Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook