Lucifer Vs God Father Cast Details in Telugu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన తెలుగు సహా హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా మీద సాధారణ ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో రూపొందిన లూసిఫర్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందింది. నిజానికి ఈ మలయాళ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది కానీ ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ సినిమాలో ఎవరెవరు నటించారు? తెలుగులో ఆ పాత్రలు ఎవరు పోషించారు? అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా మోహన్ లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో నటించారు, ఆయనకు ఖురేషి అబ్రహం అనే మరో పేరు ఉంటుంది. అదే పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పోషించారు బ్రహ్మా అనే పేరుతో అలాగే గాడ్ ఫాదర్ అలియాస్ ఖురేషి అబ్రహం పేర్లతో ఆయనను సినిమాలో సంబోధించారు. ఇక మలయాళంలో వివేక్ ఒబెరాయ్ బాబీ అనే పాత్రలో నటించగా అదే పాత్రను తెలుగులో సత్యదేవ్ జయదేవ్ పేరుతో పోషించారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ జైద్ మసూద్ అనే పాత్రలో నటించగా అదే పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ మసూమ్ భాయ్ పేరుతో నటించారు. ఇక మలయాళ వర్షన్ లో జతిన్ రాందాస్ పేరుతో టోవినో థామస్ ఒక పాత్రలో కనిపిస్తారు. కానీ తెలుగులో ఆ పాత్రను పూర్తిగా తొలగించారు.


ఇక గోవర్ధన్ అనే జర్నలిస్ట్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్ కనిపిస్తారు. కానీ తెలుగులో అదే పాత్రను పూరి జగన్నాథ్ పోషించారు. ప్రియదర్శిని అనే పాత్రలో మంజు వారియర్ నటించగా తెలుగులో అదే పాత్రలో నయనతార నటించారు. ఆ పాత్రకు సత్యప్రియ అనే పేరు పెట్టారు. ఇక మంజు వారియర్ కూతురి పాత్రలో సానియా అయ్యప్పన్ జాహ్నవి పేరుతో కనిపించగా తెలుగులో మాత్రం తాన్య రవిచంద్రన్ ఆ జాన్వి పాత్రను పోషించింది.


కానీ తెలుగు వర్షన్ లో ఆమెను నయనతార చెల్లెలిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మలయాళ వర్షన్ లో సాయికుమార్ మహేశ్ వర్మ అనే పాతలో నటించగా తెలుగులో ఆ పాత్రను మురళీ శర్మ పోషించారు. మలయాళంలో బైజు సంతోష్ నటించిన రాజకీయ పార్టీ కార్యకర్త పాత్రను తెలుగులో గెటప్ శ్రీను పోషించారు. అలాగే కళాభవన్ షాజాన్ నటించిన పాత్రలో మన నటుడు సునీల్ నటించారు. నైలా ఉష నటించిన పాత్రలో అనసూయ నటించారు.  ఫాజిల్ నటించిన ఫాదర్ పాత్రలో మురళీమోహన్ నటించారు. బిను పప్పు నటించిన జైలు వార్డెన్ పాత్రలో తెలుగులో హర్షవర్ధన్ నటించగా సచిన్ ఖేడ్కర్ నటించిన పాత్రలో బెంగాలీ నటుడు సర్వేదమం బెనర్జీ నటించారు.


గురువాయూర్ శివాజీ నటించిన మేడ్చల్ రాజా పాత్రలో షాయాజీ షిండే నటించారు, ఆ పాత్రకు బంగారు నాయుడు అనే పేరు పెట్టారు. జాన్ విజయ్ ఒక ఏసీపీ  పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రలో ఆ పాత్రను తెలుగులో సముద్రఖని పోషించారు. ఇక టీవీ సీరియల్ నటిగా మలయాళంలో శ్రియా రమేష్ కనిపించగా తెలుగులో నటి ప్రియా కనిపించారు. ఇక వీరు కాకుండా తెలుగులో గంగవ్వ కూడా కనిపిస్తారు. అలాగే షారోన్ రోమి నటించిన పాత్రలో తెలుగులో దివి నటించారు. 


Also Read: God Father Movie Review: మెగాస్టార్ మెంటల్ మాస్.. అల్లాడించాడుగా.. సినిమా ఎలా ఉందంటే?


Also Read: The Ghost Movie Review : నాగార్జున ది ఘోస్ట్ మూవీ రివ్యూ.. రోస్ట్ చేసేశాడుగా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook