God Father Movie Review: మెగాస్టార్ మెంటల్ మాస్.. అల్లాడించాడుగా.. సినిమా ఎలా ఉందంటే?

Chiranjeevi God Father Movie Review and Rating : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరక్క్షన్లో రూపొందిన సినిమా గాడ్ ఫాదర్. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 5, 2022, 12:39 PM IST
God Father Movie Review: మెగాస్టార్ మెంటల్ మాస్.. అల్లాడించాడుగా.. సినిమా ఎలా ఉందంటే?

Chiranjeevi God Father Movie Review and Rating : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు సహా హిందీ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ కావడం దానికి తోడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే లూసిఫర్ సినిమా తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండడంతో ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయని కంపేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఈ సినిమాని రీమేక్ లాగా కాకుండా స్ట్రైట్ ఫిలిం లాగా చేశామని సినిమా యూనిట్ ఎంత చెప్పినా ప్రేక్షకులలో మాత్రం కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ఏదేమైనా ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. 

గాడ్ ఫాదర్ కథ ఏమిటి?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పీకేఆర్ అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తే అతని తరువాత ముఖ్యమంత్రి స్థానాన్ని ఆక్రమించేది ఎవరు అనే విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు నలుగురికి అవకాశాలు ఉన్నాయి అంటూ గోవర్ధన్(పూరి జగన్నాధ్) సినిమా కథలోకి తీసుకువెళతాడు. అందులో ఒకరు పీకేఆర్ అల్లుడు జై(సత్యదేవ్) పీకేఆర్ పెద్ద కుమార్తె సత్యప్రియ(నయనతార), పీకేఆర్ మొదటి భార్య కొడుకు బ్రహ్మ(చిరంజీవి) అలాగే పికేఆర్ ముఖ్య అనుచరుడు హోమ్ మినిస్టర్ వర్మ(మురళి శర్మ).

వీరిలో వర్మ, జై ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మొదటి నుంచి తన అన్న మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్న సత్యప్రియ తన భర్తకే పట్టం కట్టాలని ప్రయత్నిస్తుంది. జై కూడా తన యుక్తులతో, కుయుక్తులతో అన్ని విషయాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా సీన్లోకి బ్రహ్మ ఎంట్రీ ఇస్తాడు.

జై ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం లేకుండా తన అనుచరులతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. ఈ నేపథ్యంలో జై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడా? బ్రహ్మ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు? బ్రహ్మకు గాడ్ ఫాదర్ అనే మరో పేరు ఎందుకు ఉంది? బ్రహ్మ కోసం మాఫియా డాన్ మాసూమ్ భాయ్ ఎందుకు రంగంలోకి దిగుతాడు? చివరికి ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు అనేదే ఈ గాడ్ ఫాదర్ కథ.

విశ్లేషణ;
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్ ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. సినిమా మీద అంచనాల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో మోహన్ లాల్ నటనతో చిరంజీవిని కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఈ సినిమాని ఒక రీమేక్ సినిమాలా కాకుండా పూర్తిగా తెలుగు నేటివిటీకి తగినట్లుగా తెలుగు ప్రజలు రిసీవ్ చేసుకునే విధంగా మార్పులు చేయడంలో దర్శకుడు మోహన్ రాజా సఫలమయ్యాడు.

లూసిఫర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదనుకుంటారు కానీ ఒక కొత్త యాంగిల్ లో చూపించడానికి ప్రయత్నం చేశాడు మోహన్ రాజా. మలయాళ మాతృకలో ఏవైతే కీలక పాత్రని భావిస్తారో దానిని తప్పించి చాలా తెలివిగా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునే విధంగా సినిమా రూపొందించడంలో సక్సెస్ అయ్యాడు మోహన్ రాజా. సినిమా మొదటి భాగం అంతా పీకేఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయం మీద చుట్టూనే తిరుగుతూ ఉంటుంది రెండో భాగం మొదలైన తర్వాత సినిమా కథ ఊపందుకుంటుంది. రెండవ భాగంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ అలాగే సల్మాన్ ఖాన్ తో చిరంజీవి చేసిన సీన్లు కాస్త ఇబ్బందికరంగా అనిపించిన చివరికి తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ తో దాన్ని బ్యాలెన్స్ చేయగలిగారు.

సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్ర అని అందరూ భావించారు కాకపోతే అది అతిథి పాత్ర అనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి పాత్రకు అది ఒక బాడీగార్డ్ పాత్రలాగా అనిపిస్తుంది. బహుశా దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే చివరిలో సాంగ్ పెట్టినట్టు అనిపిస్తుంది. డ్రగ్స్ మహమ్మారి మీద పోరాటం చేస్తున్నట్లు గాడ్ ఫాదర్ పాత్రధారి చిరంజీవిని చూపిస్తారు. అయితే మాఫియా డాన్స్ అందరికీ బాస్ అని మెగాస్టార్ చిరంజీవికి ఎలివేషన్స్ ఇచ్చి అలాంటి వ్యక్తి డ్రగ్స్ డాన్స్ అందరినీ చంపించేలా చేయడం కాస్త లాజిక్ కి దూరంగా ఉంటుంది.

తెలుగు ప్రేక్షకులు ఏ విషయాన్ని మరిచారు అనే విషయాన్ని అర్థం చేసుకున్న మోహన్ రాజా కరెక్ట్ గా తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి తగినట్లుగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందించాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో చిన్న చిన్న లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడికి అక్కడ తనదైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దాదాపుగా లూసిఫర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ కొన్ని కీలక మార్పులు, చేయడమే కాక ఒక పాత్రను మిస్ చేశారు. అలాగే తెలుగు ఫ్లేవర్ కు తగినట్లుగా అన్ని పాత్రలను డిజైన్ చేసి ఫర్వాలేదనిపించుకున్నారు.

నటీనటుల విషయానికి వస్తే
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రధారి చిరంజీవి ఎప్పటిలాగే తన అనుభవంతో తనదైన శైలిలో నటించి మెప్పింఛారు. కొన్ని సీన్లలో కళ్ళతోనే నటించి తనకు తానే సాటి అనిపించారు. అయితే ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ఈ సినిమా రీమేక్ కాబట్టి కచ్చితంగా లూసిఫర్ మోహన్ లాల్ పాత్రతో కచ్చితంగా కంపేర్ చేస్తారు. అయితే మెగాస్టార్ బ్రాండ్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయింది.

ఇక పూరి జగన్నాథ్ చేసింది చిన్న పాత్ర అయినా ఈయనలో కూడా ఇంత మంచి నటుడు ఉన్నాడా అని అనిపించుకునేలా చేశారు. ఇక సత్యదేవ్  గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సత్యదేవ్ నటన అత్యద్భుతంగా ఉంది. సెకండ్లలోనే  వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులందరినీ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సల్మాన్ ఖాన్ చాలా తక్కువ స్క్రీన్ రీసన్స్ దొరికినా సరే తనదైన మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవి అనుచరుడి పాత్రలోనే సల్మాన్ ఖాన్ కనిపించినట్లుగా చెప్పుకోవాలి.

మసూం బాయ్ అనే పాత్రతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేశాడు. నట్లుగా చెప్పొచ్చు అయితే సొంత డబ్బింగ్ కారణంగా కాస్త ఎబ్బేట్టుగా అనిపిస్తుంది. నయనతార ఎప్పటిలాగే తన అనుభవంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాన్యా రవిచంద్రన్ కు కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించిందని. వీరు కాకుండా సముద్రఖని, ప్రియా, మురళీ శర్మ, నాగమహేష్, బ్రహ్మాజీ, సునీల్, దివి, అనసూయ భరద్వాజ్, భరత్, గెటప్ శ్రీను వంటి వారు తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

టెక్నికల్ టీం విషయానికి వస్తే
టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ సినిమాను మరో లెవల్ కి తీసుకువెళ్లాడు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. వివిధ లొకేషన్లలో ఆయన కెమెరా పనితనం తెరమీద కనిపించింది. మోహన్ రాజా టేకింగ్ కు లక్ష్మీ భూపాల డైలాగ్స్ ప్లస్ అయ్యాయి.. కొన్ని చోట్ల రాజకీయ నాయకులను ఏకి పారేసే డైలాగ్స్ తో ఆయన ఆకట్టుకున్నాడు.

ఇక ఎడిటింగ్ కూడా ఎక్కడా వంక పెట్టే విధంగా లేదు. పూర్తిస్థాయిలో టెక్నికల్ వాల్యూస్ అన్నీ రంగరించి ఈ సినిమా రూపొందించినట్లుగా అనిపిస్తుంది. అయితే మెగాస్టార్ కాస్ట్యూమ్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ వాడిన గన్ల విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొనే అవకాశాలుంటాయి. చిన్న చిన్న విషయాలను ఆర్ట్ డిపార్ట్మెంట్ విస్మరించినట్లు అనిపిస్తుంది. పట్టి చూస్తే ఆ లోపాలు ఇట్టే అర్థమయిపోతాయి.
 
ఫైనల్ గా
ఫైనల్ గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి దసరా బొనాంజా. నార్మల్ ఆడియన్స్ ఒక్కసారి ఫ్యామిలీలతో కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగిన మూవీ ఇది.

 

Rating : 3/5

Also Read: Godfather Twitter Review : గాడ్ ఫాదర్ ట్విటర్ట్ రివ్యూ.. అదే పెద్ద మైనస్ అంటున్నారే!

Also Read: The Ghost Twitter Review: కింగ్ హిట్టు కొట్టాడా? సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఏమంటున్నారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News