MAA association elections 2021 latest updates: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 10 ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MAA association elections important dates: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ 2021 ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరణ చేపట్టి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. 2వ తేది సాయంత్రం 5 గంటల తర్వాత అంతిమంగా మా ఎన్నికల రేసులో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు జరగనుండగా అదే రోజు రాత్రి 7 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 


Also read : Breaking news: టాలీవు డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ కు క్లీన్ చిట్...


MAA association elections rules: మా అసోసియేషన్ ఎన్నికల నియమ నిబంధనలు: 
1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాల్సి ఉంటుంది.
2. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మీటింగ్‌లకు హాజరు కానివారికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 
3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు లేనట్టేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA association latest news) ప్రకటించింది.


Also read : Bigg Boss 5 Telugu: శ్రీరామ చంద్ర చేసిన Prize money కామెంట్స్‌పై నెటిజెన్స్ ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook