MAA Elections: ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ జోరుగా ప్రచారం...రూ.10కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు!

MAA Elections: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో..అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ .. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 08:09 PM IST
  • జోరుగా 'మా' ఎన్నికల ప్రచారం
  • కళాకారుల సంక్షేమం కోసం ప్రకాష్ రాజ్ వరాల జల్లు
  • రూ.10కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని వెల్లడి
MAA Elections: ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ జోరుగా ప్రచారం...రూ.10కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు!

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(MAA Elections 2021) ఎన్నికల ప్రచారంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ చురుగ్గా ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు 100 మంది సినీ కళాకారులతో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ భేటీ అయ్యింది. ‘మా’ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)చర్చించారు. కళాకారుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. 

‘మా’ మసకబారడానికి కొందరే కారణం: ప్రకాశ్‌రాజ్‌
అంతేకాకుండా తన ప్యానల్‌ కనుక గెలిస్తే ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో కార్పస్‌ ఫండ్‌(Corpus Fund) ఏర్పాటు చేస్తానని అన్నారు. కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యం కోసం కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కేవలం 6 నెలల్లోనే తన పనితనాన్ని చూపిస్తానని అన్నారు. ‘మా’ మసకబారడానికి కొందరు మాత్రమే కారణమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్‌లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని.. కొంతమంది హీరోలు సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. 

ఈ ఏడాది ‘మా’ ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బలంగా పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మొన్నటివరకూ ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా ఉన్న బండ్లగణేశ్‌(Bandla Ganesh) ఆ ప్యానల్‌ నుంచి వైదొలగారు. జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఆయన జీవిత(jeevita rajasekhar)పై పోటీ చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈ సారి ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ తో పాటు.. తెలంగాణ వాదం కూడా వినిపిస్తోంది. నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News