Manchu Vishnu Panel Oath Taking: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవం
MAA Association President Manchu Vishnu Panel Oath Taking Ceremony : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు, ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
MAA elections 2021 Manchu Vishnu Oath Taking Ceremony As MAA Association President : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా) ఎన్నికల్లో (Movie Artist Association Elections) విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, (ManchuVishnu) అతని ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో (Film Nagar Cultural Center) ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ (Krishnamohan) సమక్షంలో ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు, ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో ‘మా’లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది.
Also Read : Sasikala Political Reentry: ఇవాళ అమ్మ సమాధికి శశికళ, కీలక ప్రకటన చేసే అవకాశం
అయితే ఈ కార్యక్రమానికి ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ వారు తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానెల్ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు.
పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మోహన్‌బాబుతో (Mohanbabu) పాటు విష్ణుకి మద్దతుగా ఉన్న నరేశ్ (Naresh) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా బాలకృష్ణ (Balakrishna) రావాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన హాజరు కాలేకపోయారు. ఇక ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని (Chiranjeevi) కూడా కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపారు. కానీ నేటి కార్యక్రమంలో చిరంజీవి, మెగా హీరోలెవరు కనిపించలేదు.
Also Read : Coronavirus updates: దేశంలో కాస్త తగ్గిన కోవిడ్ కేసులు, 166 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి