MAA Elections 2021 Mohan babu sensational comments on MAA Elections polling: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఒక కళాకారుల వేదిక, ఇక్కడ రాజకీయాలు ఉండకూడదంటూ నటుడు మోహన్‌బాబు అన్నారు. మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్‌బాబు (Mohan babu) మాట్లాడారు. మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమనేది సాధారణమైన విషయం కాదన్నారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలని విష్ణుకి (Vishnu) సూచించారు మోహన్‌బాబు. అలాగే అసోసియేషన్‌లో ఉన్న వారంతా కలిసి కట్టుగా ఉండాలని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘మా’ ఎన్నికల (MAA Elections) సమయంలో కొందరు.. మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది కళాకారులను బెదిరించారని మోహన్‌బాబు అన్నారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదని.. వారికి ఇష్టమైన వారికి ఓటు వేశారన్నారు. అలా తన కుమారుడు మంచు విష్ణును (Manchu Vishnu) గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


Also Read : Spicejet Airlines: స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన డీజీసీఏ, కార్గో లైసెన్స్ నిలిపివేత


ఒకరి దయాదాక్షణ్యాలపై సినీ పరిశ్రమ (film industry) ఉండలేదని స్పష్టం చేశారు. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగగలన్నారు. తనకు పగ, రాగద్వేషాలు ఏవీ లేవన్నారు. ఇక్కడ మనం కేవలం కళాకారుల గురించే మాట్లాడదాము.. రాజకీయాల గురించి వద్దని హితవు పలికారు మోహన్‌బాబు. 


ఇక ఓటు వేయని వాళ్లపై పగ వద్దని సూచించారు.. ఎందుకంటే పగ మనిషిని సర్వనాశనం చేస్తుందని చెప్పారు. భారతదేశం గర్వించేలా ‘మా’ ఖ్యాతిని పెంచాలని మోహన్‌బాబు (Mohan babu) కోరారు. ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారానికి త్వరలో తాను సీఎం కేసీఆర్‌ని కలిసి మాట్లాడతానన్నారు. అలాగే ‘మా’ అధ్యక్షుడు (MAA president) పదవి అనేది ఒక చిన్న ఉద్యోగం కాదని అది చాలా పెద్ద బాధ్యత అని అన్నారు. 


Also Read : Manchu Vishnu Panel Oath Taking: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవం, కొలువుదీరిన కొత్త కార్యవర్గం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి