MAA Elections 2021: ‘మా’ ఎన్నికల ప్రక్రియలో మార్పు.. తుది ఫలితాలు అప్పుడే
Movie Artists Association election results: మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ప్రకటించిన విధంగా కాకుండా ఎన్నికల షెడ్యూలు కాస్త మారింది.
MAA elections 2021 Movie Artists Association election results date change: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్- మా ఎన్నికల (Movie Artists Association - MAA elections) అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో (telugu states) హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్ 10న జరగబోయే ఈ ఎన్నికల కోసం నోటిఫికేషన్ రాకముందు నుంచే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రకాశ్ రాజ్ (prakash raj) వర్గం.. మరొకవైపు మంచు విష్ణు (manchu vishnu) వర్గం ఎవరికి ఎవరు తగ్గట్లేదు. మీడియా ఎదుట, సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.
Also Read : Samantha Emotional Post: "నాపై వ్యక్తిగత దాడి సమంజసం కాదు": సమంత
అయితే మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ప్రకటించిన విధంగా కాకుండా ఎన్నికల షెడ్యూలు కాస్త మారింది. మొదట అక్టోబరు 10న (october 10) పోలింగ్ అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుతం ఇందులో కాస్త మార్పులు జరిగాయి.
అక్టోబరు 10న పోలింగ్ (polling) జరగనుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 11న ఫలితాలు వెల్లడవుతాయి. ‘మా’ అధ్యక్షుడు (maa president) ఎవరు? అనేది తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాలి. మరి మా ఎన్నికల్లో (MAA elections) అధ్యక్ష పదవి మంచు విష్ణును వరించనుందో లేదంటే ప్రకాశ్‌రాజ్‌కు దక్కనుందో చూడాలి.
Also Read : SRH vs MI match score live updates: సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్.. ఎవరి బలం ఎంత ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook