MAA Elections : నేను ఓటేసిన వారే గెలుస్తారు - బండ్ల గణేశ్
Bandla Ganesh sensational comments: బండ్ల గణేశ్ (Bandla Ganesh) మా ఎన్నికల్లో ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలంటేనే గొడవని అన్నారు. పోలింగ్ కేంద్రంలో గొడవలు జరుగుతున్నాయట కదా? అని ప్రశ్నించగా.. గొడవలే కదా.. హత్యలు, అత్యాచారాలైతే జరగడం లేదుకదా అని వ్యాఖ్యానించారు. మా ఎన్నికల్లో తాను ఓటేసిన వ్యక్తులే గెలుస్తారని చెప్పారు బండ్ల గణేశ్.
MAA elections 2021 polling nagababu voted for Prakash Raj and Bandla Ganesh sensational comments: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఒక పక్క కొరుకులాటలు, మరో పక్క కౌగిలింతల నేపథ్యంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి మా ఎన్నికలు (MAA elections). ఇక ఇప్పటికే చాలామంది సినీ తారలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బండ్ల గణేశ్ (Bandla Ganesh) కూడా మా ఎన్నికల్లో ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలంటేనే గొడవని అన్నారు. పోలింగ్ కేంద్రంలో గొడవలు జరుగుతున్నాయట కదా? అని ప్రశ్నించగా.. గొడవలే కదా.. హత్యలు, అత్యాచారాలైతే జరగడం లేదుకదా అని వ్యాఖ్యానించారు. మా ఎన్నికల్లో తాను ఓటేసిన వ్యక్తులే గెలుస్తారని చెప్పారు బండ్ల గణేశ్.
Also Read: MAA Elections : "మా" గొడవలకు తెర వెనుక ఉండి నడిపించే వారే కారణం - రోజా
ఇక ముందు నుంచి మా ఎన్నికల్లో వరుస ట్విస్టులు ఇస్తున్నాడు బండ్ల గణేష్. ముందుగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి బరిలోకి దిగిన బండ్ల.. జీవితా రాజశేఖర్ (jeevitha rajasekhar) ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి చేరిపోవడంతో.. ఆమెకు వ్యతిరేకంగా ప్యానల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జీవితాపై పోటీగా జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా బరిలోకి దిగి.. నామినేషన్ వేసిన అనంతరం అనుహ్యాంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక ఎన్నికల జరగడానికి ముందు వరుసగా ట్వీట్స్ చేశారు. మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థి రఘుబాబును గెలిపించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు ఓటు వేయాలని సోషల్ మీడియా కోరారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా ఫోటోను ((jeevitha photo) పూర్తిగా మార్క్ చేశాడు బండ్ల గణేశ్. అలా జీవితపై తనకున్న కోపాన్ని బయటపెట్టారు బండ్ల గణేష్ (Bandla Ganesh).
అలాగే మెగా బ్రదర్ నాగబాబు ( nagababu) కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం మీడియాతో నాగబాబు మాట్లాడారు. ఓటు ఎవరికి వేశారని ప్రశ్నించగా.. మూడు రోజుల నుంచి చెబుతున్నా.. కొత్తగా ఏం చెబుతాను అన్నారు. మా ఎన్నికల్లో (MAA elections) తాను ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానల్ కే తాను ఓటేశానని చెప్పారు.
Also Read : Balakrishna: ‘హోస్ట్ గా బాలయ్య...'ఆహా'లో ‘'Unstoppable With NBK' పేరుతో ప్రసారం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook