MAA Elections 2021 Prakash Raj tweets deeper meaning behind my resignation to MAA: తాజాగా ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ‘మా’ సభ్యత్వానికి (maa membership) తాను రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందన్నారు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj). అయితే అదేంటో త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. మాకు (ప్యానెల్‌) మద్దతుగా నిలిచిన మా సభ్యులందరికీ నమస్కారం.. నేను మా సభ్యత్వానికి (maa membership) రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందంటూ సోషల్‌మీడియాలో (social media) ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. మిమ్మల్ని మేం నిరాశ పరచం.. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Huzurabad bypolls: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం


కాగా తాజాగా జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు (Manch Vishnu)తో పోటీపడిన ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోడిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ప్రకాశ్‌ రాజ్‌ పలు విషయాలపై మాట్లాడిన విషయం తెలిసిందే. రాజీనామా (resignation) (నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని చెప్పారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టమన్నారు ప్రకాశ్‌రాజ్. తాను అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానన్నారు. మా ఎన్నికలు ప్రాంతీయత ఆధారంగా జరిగాయని అన్నారు. ఇలా చాలా విషయాలు వెల్లడించిన ప్రకాశ్‌రాజ్‌ ఇప్పుడు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా త్వరలోనే చెప్తా అన్నారు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj).



 


Also Read : Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook