MAA Elections 2021 Results: 'మా'ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. ఈసీ మెంబర్లుగా కౌశిక్‌, శివారెడ్డి గెలుపొందారు. వీళ్లిద్దరూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌(PrakashRaj panel)కు చెందిన వాళ్లే. అటు పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballet) ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. సంపూర్ణేశ్ బాబుపై పోటీ చేసిన శివా రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. తాజాగా ప్రకాశ్ ప్యానల్‌కే చెందిన అనసూయ, కౌశిక్‌, సురేశ్‌ కొండేటి గెలుపొందారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అధ్యక్షుడిగా మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు ఆయన ప్యానెల్‌ ఆధిక్యంలో ఉంది. మంచు విష్ణు ప్యానెల్‌లో 10మంది ఈసీ సభ్యుల ముందంజలో ఉన్నారు. పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 50 చెల్లనివిగా గుర్తించారు. మరికాసేపట్లో తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. మోహన్‌ బాబు, మురళీ మోహన్‌(Murali Mohan) సమక్షంలో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.


Also read: MAA Elections 2021 : వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా అంటూ విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్‌ సెటైర్


కౌంటింగ్‌(Counting) కోసం ఆరు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఇద్దరికి అనుమతి ఇచ్చారు. మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ నుంచి 60 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook