మీ అభిమాన జీ తెలుగు టీవీ ఛానెల్లో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్‌లో ఈ ఎపిసోడ్‌లో రేవ్ పార్టీ కారణంగా వసుంధర చిక్కుల్లో పడుతుంది. వసుంధరతో చీటీ తీయించి.. ఇప్పుడు ఆమె ముద్దు పెట్టాలని వంశీ అనడంతో ఆమె ఏం చేయాలో తెలియని పరిస్ధితిలో వంశీతో పందెం వేయించి గడువు సమీపిస్తున్నకొద్దీ టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు వంశీ పందెం గడువు దాటాక తాగి, అల్లరి చేయవచ్చని, అతడిని కట్టడి చేయడానికి గదిలో పెట్టి లాక్ వేయమని నిషా, వసుంధరకు సలహా ఇస్తుంది. వాళ్లిద్దరూ గదిలోకి వెళ్లాక తాళం వేసి, బంధించాలని నిషా ప్లాన్ చేస్తుంది. ఆ గదిలో, డ్రగ్స్ కూడా పెడుతుంది. నిషా దుర్మార్గపు ఆలోచనను మొదట పసిగట్టలేకపోయిన వసుంధరకు ఆ తర్వాత నిషా ప్రవర్తనపై అనుమానం వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నిషాపై అనుమానంతో వసుంధర ప్లాన్‌లో మార్పు చేస్తుంది. వంశీని ఇరికించడానికి, అతని ఫ్రెండ్స్ పందెం గెలిచినందుకు వసుంధర నిజంగా ముద్దు పెడతానందని, వెళ్లి కలవమని చెప్తారు. అప్పుడే ఊహించని విధంగా పోలీసులు రైడింగ్‌కి  వస్తారు. వసుంధర, వంశీలు గదిలో చిక్కుకుపోతారా? ఊహించని విధంగా పోలీసులకు దొరుకుతారా? లేక తప్పించుకుంటారా? అసలేం జరుగుతుందో అనే ఉత్కంఠ కలిగించే మాటే మంత్రము సీరియల్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూనే ఉంది. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.