మీ అభిమాన జీ తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్‌లో గదిలో చిక్కుకుపోయిన వసుంధర, వంశీల మధ్య చిలిపి తగవులను చూడొచ్చు. వంశీ, వసుంధరలు కనపడటం లేదని ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది వంశీ బామ్మ. అంతలోనే టివీలో రేవ్ పార్టీలో అరెస్ట్ చేసిన వారిని చూపించడంతో ఆ వార్త చూసి అందరూ షాక్ అవుతారు. పార్టీ ఏర్పాటు చేసిన వారిని, వాళ్ల వెనక వున్నవారి గురించి టీవీల్లో చూపించొద్దని పోలీస్ ఇన్స్‌పెక్టర్ అభిప్రాయపడతారు. కోర్టులో శిక్ష పడేవరకు ఎటువంటి న్యూస్ బయటపడకూడదని వారికి సూచిస్తాడు. ఇదంతా టీవీలో చూసిన ఇంట్లో వాళ్లంతా కంగారు పడుతుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాకర్ల పరువు పోకూడదని వంశీ బామ్మ ఆవేదన వ్యక్తంచేస్తుంది. ఒకానొక దశలో ఎస్‌ఐని కూడా కొనేద్దామని అనుకుంటారు. కానీ అతను ఎవరికీ లొంగే రకం కాదని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మిన్నకుండిపోతారు. ఇదంతా వసుంధర వల్లే జరిగిందని బామ్మ వసుంధరను నిందిస్తుంది. మరోవైపు అక్కడ వంశీ వసుంధరతో సేవలు చేయించుకుంటూ వుంటాడు. ఈ క్రమంలోనే నెమ్మది నెమ్మదిగా వసుంధర, వంశీల మధ్య ప్రేమ చిగురు తొడగడం ఈ ఎపిసోడ్‌లో చూడొచ్చు. మరి వంశీ, వసుంధరలు బయటపడతారా? లేదా అనేది ఎపిసోడ్ చూస్తేనే స్పష్టత వస్తుంది. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.