Nitin First Look: టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో కన్పించనున్న మాచర్ల నియోజకవర్గం ఫస్ట్‌లుక్ విడుదైలంది. గతానికి భిన్నంగా కన్పిస్తున్న నితిన్ లుక్..ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నితిన్ అభిమానులకు గుడ్‌న్యూస్. నితిన్ ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజ శేఖర్  రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం ఫస్ట్‌లుక్ విడుదలైంది. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం ఫస్ట్‌లుక్‌లో నితిన్ చాలా విభిన్నంగా కన్పిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌పై నితిన్ ట్వీట్ కూడా చేశాడు. సిద్ధార్ధ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నానని..మీకు నచ్చిన విధంగా, మెచ్చిన మాస్‌తో వస్తున్నానంటున్నాడు నితిన్.


మాచర్ల నియోజకవర్గం ఫస్ట్‌లుక్‌లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది. మెడ‌లో వెండి లాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌‌గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్‌గా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు.


ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా న‌టిస్తున్నారు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


Also read: RRR Movie: 'ఆర్ఆర్ఆర్'పై అల్లు అర్జున్ రియాక్షన్... తారక్, చెర్రీ పెర్ఫామెన్స్‌పై ప్రశంసలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook