Mad sequel Update: ముగ్గురు యంగ్ హీరోలతో వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా మ్యాడ్. ఎటువంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకి త్వరలోనే రెండో భాగం రానుందని ఈ చిత్రం నిర్మాత నాగ వంశీ ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమం సినిమా యూనిట్ మధ్య ఘనంగా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్య యువ దర్శకులతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. జెర్సీ, డిజె టిల్లు, మ్యాడ్, టిల్లు స్క్వేర్ ఇలా వరుస విజయాలు అందుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు తమ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ ప్రారంభించింది.
 2023 అక్టోబరులో విడుదలై ఘన విజయం సాధించిన మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు.


'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, ఈ మధ్యనే సితార ఎంతైన్మెంట్స్ ద్వారా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన 'టిల్ స్క్వేర్‌'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. 


ఇక ఈ సీక్వెల్ లో కూడా మొదటి పార్ట్ లో కనిపించిన హీరోలే కనిపించని ఉన్నాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు అని ఈ సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు సినిమా యూనిట్. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు తెలిపారు ఈ చిత్ర యూనిట్.


'మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి ఈ సీక్వెల్ సినిమాతో 'మ్యాడ్ నెస్' రెట్టింపు ఉంటుందని పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటి అంటే
'మ్యాడ్ స్క్వేర్' చిత్ర ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. మరి ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?


Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook