Kannappa: పన్నాగ గా మధుబాల ఫస్ట్ లుక్.. కన్నప్ప పై పెరిగిపోతోన్న అంచనాలు!
Kannappa Pannaga: మంచు విష్ణు హీరోగా చేస్తున్న కన్నప్ప సినిమాపై రోజురోజుకి.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు సినిమా యూనిట్.. ఒక అప్పటి ఫేమస్ హీరోయిన్ మధుబాల.. ఫస్ట్ లుక్ ని.. విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
Madhubala first look from Kannappa: సినీ ప్రేక్షకులలో.. ప్రస్తుతం కన్నప్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విరుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి..మధుబాల ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో అలనాటి హీరోయిన్ మధుబాల పన్నాగా క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది.
ఈ పోస్టర్లో మధుబాల పన్నాగగా కనిపించగా.. ఆ పోస్టర్ పై రాసిన అక్షరాలు ఆమె క్యారెక్టర్ని వర్ణించాయి. ఆ అక్షరాలు ఆమె వీరనారి తెగువను తెలిపేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అనేకమంది పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉండడంతో.. ప్రతి ఒక్కరి ఫస్ట్ లుక్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ పోస్టర్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. ఇక సౌత్ స్టార్స్.. కాకుండా ఈ చిత్రంలో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో.. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దబోతున్నారు సినిమా యూనిట్. ధైర్యవంతుడైన యోధుడు.. శివునికి అతి గొప్ప భక్తుడైన కన్నప్ప కథను.. ఈ సినిమా ద్వారా తెరకెక్కించనున్నారు దర్శకుడు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యనున్నారు. బాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ జోరు మరింత పెంచనున్నారు చిత్ర యూనిట్.
Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter