Kanguva: కంగువ విడుదలకు కష్టాలు.. ఇక సూర్య సినిమా ఈ వారం లేనట్టేనా..?
Kanguva release date: సూర్య హీరోగా వస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం కంగువ. ఈ సినిమా తమిళ బాహుబలి కానుంది అని సూర్య చెప్పడంతో.. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని ఆయన అభిమానులకు నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ క్రమంలో ఈ సినిమాకి విడుదల తేదీ గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Kanguva release controversy: సూర్య గురించి సౌత్ ఇండియా.. ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ కూడా సూర్యకి తెలుగులో.. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సూర్య నటించిన గజినీ సినిమా ఒకప్పుడు సౌత్ ఇండియాలో సెన్సేషనల్ సినిమాగా నిలిచింది. కానీ ఈ మధ్య సూర్యకు తెలుగులో అనుకున్న స్థాయిలో విజయాలు అయితే రాలేదు. ఈ క్రమంలో తన తదుపరి సినిమా కంగువ పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఈ హీరో.
సూర్య నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో.. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఓ లెవెల్ లో పెట్టారు నిర్మాత. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఒక పెద్ద వివాదమే జరుగుతోంది.
సూర్య నటించిన కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇక కేవలం ఒక్కరోజు ఉండగా.. ఇప్పుడు.. అనుకోని సమస్యలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, మద్రాస్ హైకోర్టు నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ. 20 కోట్లు డిపాజిట్ చేయకపోతే.. కంగువను విడుదల చేయకుండా ఆపేయాలని.. ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయానికి వస్తే..2011లో స్టూడియో గ్రీన్ సంస్థతో అర్జున్‌లాల్ సుందర్‌దాస్ చేసిన ఒప్పందం వల్ల ఈ వివాదం ఏర్పడింది.
కోర్టు ప్రకటన ప్రకారం, "నిర్మాత నవంబర్ 13 అర్థరాత్రి లోపు 20 కోట్లు డిపాజిట్ చెయ్యాలి. సినిమా విడుదలకు ముందస్తు ఈ రాబడి లెక్కను అందించవలసి ఉంటుంది," అని ఉంది. ఈ సమస్యకు కారణం 2011లో నిర్మాణానికి పెట్టుబడిగా రూ. 40 కోట్లు అర్జున్‌లాల్, జ్ఞానవేల్ పెట్టాలి అనుకున్నారు. 12.85 కోట్లు అందించిన తరువాత.. అర్జున్ లాల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే నిర్మాత తప్పకుండా తర్వాత జ్ఞానవేల్ అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం 2019లో కోర్టు నిర్మాతకు..పెండింగ్ బాకీలను.. అనగా 10.5 కోట్లు ఇంకా దాని ఇంట్రెస్ట్.. తీర్చాలని తీర్పు ఇవ్వడం. కానీ ఈ మధ్య జ్ఞానవేలు నిర్మించిన తంగలాన్ విడుదల తరువాత కూడా.. ఆ మొత్తంలో రూ. 3.93 కోట్లు మాత్రమే వసూలు చేయడం వల్ల, ఇప్పుడు కొత్తగా కేసు వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు "కంగువను విడుదల చేయకూడదు" అని ఆదేశాలు ఇచ్చింది.
ఈ సినిమా నిర్మాతలు ఈ సమస్యను.. త్వరగా తొలగించుకొని రేపు ఈ చిత్రం విడుదల చేస్తారా లేదా అనేది చూడాలంటే.. మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే
Also Read : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి