Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమా.. మళ్లీ మళ్లీ చూసా అంటోన్న స్టార్ హీరో..!
Vijay Sethupathi about Mahesh Babu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు.. విజయ్ సేతుపతి.. మహేష్ బాబు సినిమాని పదేపదే చూశారట. సినిమాలో ప్రతి సీను.. తనకి చాలా బాగా గుర్తుండిపోయింది.. అని అన్నారు. ఇంతకీ అది ఏం సినిమానో తెలుసా?
Vijay Sethupathi about Mahesh Babu movie: తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలియని వారు ఉండరు. తమిళ్ లో మాత్రమే కాక తెలుగులో.. కూడా కీలక పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. విజయ్ సేతుపతి. ఈ మధ్యనే విడుదలైన మహారాజా సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.
తాజాగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు నటించిన ఒక సినిమాని.. ఆయన రిపీట్ మోడ్ లో చూశారట. అందులో ప్రతి సీను తనకి చాలా గుర్తుండిపోయింది అని అన్నారు. ఆ సినిమానే అతడు.
మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమా.. అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి.. క్లైమాక్స్ దాకా.. చాలా ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది ఈ సినిమా. తను కష్టాల్లో ఉన్నప్పుడు..విజయ్ సేతుపతి ఈ సినిమాని పదేపదే చూశారట.
"అందులో మహేష్ బాబు ఎంట్రీ నుంచి.. క్లైమాక్స్ దాకా ప్రతి సీన్ నాకు చాలా బాగా గుర్తుంది. సినిమాలోని భావోద్వేగాలను.. త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. మహేష్ బాబు, త్రిషల మధ్య కెమిస్ట్రీ.. కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ రొమాన్స్ నాకు బాగా నచ్చింది. బ్రహ్మానందం గారి కామెడీ సన్నివేశాలు, సినిమాలోని పాటలు అన్నీ చాలా బాగా నచ్చాయి" అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.
2005లో విడుదలైన అతడు సినిమా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తనకి చాలా బాగా ఇష్టం అని అంటూ విజయ్ సేతుపతి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి..కూడా మరొక హీరో సినిమా గురించి ఇంతలా పొగడడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి.
Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీని లాగిన కేటీఆర్
Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్ ఇస్తా: చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter