Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్‌ ఇస్తా: చంద్రబాబు

Chandrababu Focus On Telangana TDP: ఏపీలో మాదిరి తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 10, 2024, 08:52 PM IST
Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్‌ ఇస్తా: చంద్రబాబు

Chandrababu Focus On TTDP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇక తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండో శనివారం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీని బలపర్చడంపై ఆలోచనలు చేస్తున్నామని.. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని ప్రకటించారు.

Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం

ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రెండోసారి చంద్రబాబు తెలంగాణ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. 'అందరినీ చూడడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి ఇక్కడ అందరినీ కలిసి రెండు గంటలు గడుపుదామని వచ్చా. ఇక్కడ వచ్చిన తరువాత నాకు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకున్నా. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని అందరూ కోరుకుంటున్నారు' అని తెలిపారు.

Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన

'పార్టీలో పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారందరి కోసం పార్టీ బలపర్చాలని అనుకుంటున్నా. పార్టీ ఎలా బలపర్చాలనేది ఆలోచన చేస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ అధ్యక్షుడిని పెట్టలేదు' అని చంద్రబాబు తెలిపారు. 'ఇక్కడ రెండు ఎన్నికలకు దూరంగా ఉన్నాం. పార్టీని ఎలా బలోపేతం చేయాలని, ప్రజలకు ఎలా సేవలు అందించాలి అనేది ఆలోచిస్తున్నాం' అని వివరించారు. 'తెలుగు ప్రజల కోసం నిరంతరం పని చేసిన పార్టీ టీడీపీ. ఆంధ్రపదేశ్‌లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఏపీని దారిలోకి తెచ్చుకోవాలి' అని చెప్పారు.

'తెలుగు ప్రజల మనోభావాల కోసం పని చేస్తాం. ఇప్పుడు ఏపీలో ఆలయాలపై దాడులు జరగడం లేదు. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో తెలుగు జాతి ఎదగాలి' అని చంద్రబాబు ఆకాంక్షించారు. 'విజన్ 2047 కోసం పనిచేస్తాం. 2047 వరకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడం నా లక్ష్యం. ఆ రోజు 2024 అని మాట్లాడితే నన్ను 420 అన్నారు. సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే నన్ను హేళన చేశారు' అని గుర్తుచేసుకున్నారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతాయని పేర్కొన్నారు. 

'ట్రస్ట్ భవన్‌లో ప్రతి నెలలో రెండో శనివారం పార్టీ పుననిర్మాణానికి నాయకులు, కార్యకర్తలను కలుస్తా. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు సభ్యత్వ నమోదు తరువాతనే జరుగుతుంది. ప్రతి నేత కష్టపడి పని చేయాలి' తెలంగాణ నాయకత్వానికి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. త్వరలో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని నేతలకి చెప్పారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నేతలకి దిశానిర్దేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News