Mahesh Babu's vaccination drive in Burripalem village: అలనాటి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు బుర్రిపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ క్యాంప్ నిర్వహించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మే 31న తన తండ్రి కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకుని బుర్రిపాలెంలో మహేష్ బాబు ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రాలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరం అయినప్పుడల్లా ఆ రెండు గ్రామాలకు తన వంతు సాయం చేస్తూ ఆయా గ్రామాల అభివృద్ధిలో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్న మహేష్ బాబు తాజాగా కరోనా కోరలు చాస్తున్న తరుణంలో బుర్రిపాలెం గ్రామస్తులకు కరోనా వ్యాక్సిన్లు (COVID-19 vaccines) ఇప్పించాడు.


Also read : Pawan Kalyan with Akira Nandan: అకీరా నందన్ s/o పవన్ కల్యాణ్.. లేటెస్ట్ ఫోటో వైరల్


ఇప్పటికే హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నిరుపేదలైన చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్న మహేష్ బాబుకు రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఇప్పుడిలా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహించి బుర్రిపాలెం గ్రామస్తుల మనసులోనే కాదు.. అభిమానుల (Mahesh Babu fans) గుండెల్లోనూ మరింత చోటు సంపాదించుకున్నాడు.


Pranitha Subhash wedding: ప్రణీత సుభాష్‌కి పెళ్లయింది.. వరుడు ఎవరంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook